Gold Rate Today: స్థిరంగానే బంగారం ధరలు, మరింత తగ్గే అవకాశం...

ముఖ్యంగా బంగారం ధరలు తగ్గేందుకు రూపాయి విలువ బలపడటంతో పాటు, ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడంతో ప్రత్యామ్నాయ పెట్టుబడుల్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతోంది. మరోవైపు అంతర్జాతీయంగా చూస్తే అమెరికాలో జాబ్ డేటా సానుకూలంగా రావడంతో పాటు, మెక్సికోపై సుంకాల విధింపులో సడలింపులు సైతం బులియన్ మార్కెట్ ను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి.

news18-telugu
Updated: June 11, 2019, 7:08 PM IST
Gold Rate Today: స్థిరంగానే బంగారం ధరలు, మరింత తగ్గే అవకాశం...
Gold Rate: హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధర (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
Gold Rate Today: బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా పతనమైన బంగారం ధర ప్రస్తుతం స్థిరీకరణకు చేరుకుంది. హైదరాబాద్‌లో 24 కేరట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.33600గా ఉండగా, 22 కేరట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ.31100 గా ఉంది. అలాగే ముంబైలో 24 కేరట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.33435గా ఉంది. చెన్నైలో 24 కేరట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.33,500 గా ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా బంగారంపై పెట్టుబడులు తగ్గడంతో రిటైల్ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దేశీయంగా డిమాండ్ కూడా తగ్గడం కూడా ఈ తగ్గుదలకు కారణంగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా బంగారం ధరలు తగ్గేందుకు రూపాయి విలువ బలపడటంతో పాటు, ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడంతో ప్రత్యామ్నాయ పెట్టుబడుల్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతోంది. మరోవైపు అంతర్జాతీయంగా చూస్తే అమెరికాలో జాబ్ డేటా సానుకూలంగా రావడంతో పాటు, మెక్సికోపై సుంకాల విధింపులో సడలింపులు సైతం బులియన్ మార్కెట్ ను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి.ఇదిలా ఉంటే ట్రెండ్ ఇలాగే కొనసాగితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం లేకపోలేదని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

First published: June 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు