Gold Price Today | బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతూ వస్తున్నాయి. పసిడి రేటు ఈరోజు కూడా నిలకడగానే ఉంది. గోల్డ్ రేటు (Gold) దారిలోనే వెండి కూడా పయనించింది. సిల్వర్ (Silver) రేటులో కూడా ఎలాంటి మార్పు లేదు. పసిడి రేటు గత నాలుగు రోజులుగా స్థిరంగానే ఉంటూ వస్తోందని చెప్పుకోవచ్చు. దీంతో నవంబర్ 28న తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉంది. రూ 52,980 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. ఈ గోల్డ్ రేటు రూ. 48,560 వద్ద ఉంది. నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగాయని చెప్పుకోవచ్చు. కాగా బంగారం ధరల్లో నాలుగు రోజులుగా దాదాపు ఎలాంటి మార్పు లేదు.
కేవలం రూ.35 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్!
ఇక వెండి రేటు విషయానికి వస్తే.. వెండి ధర స్థిరంగానే ఉంది. కేజీ వెండి రేటు రూ. 67,500 వద్దనే కొనసాగుతోంది. నిన్న కూడా సిల్వర్ రేటు స్థిరంగానే ఉంది. కాగా గత నాలుగు రోజుల్లో చూస్తే సిల్వర్ రేటు దాదాపు రూ. 700 మేర పడిపోయిందని చెప్పుకోవచ్చు. వెండి పట్టీలు, ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం.
పీఎం కిసాన్ రూ.2 వేలు పొందే రైతులకు అలర్ట్.. ఈ సర్వీసులకు చార్జీలు!
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే.. బంగారం ధరలు తగ్గాయి. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. బంగారం ధర ఔన్స్‌కు 0.23 శాతం మేర క్షీణించింది. 1749 డాలర్ల వద్ద కదలాడుతోంది. అలాగే వెండి రేటును గమనిస్తే.. సిల్వర్ రేటు ఔన్స్‌కు 0.92 శాతం మేర పడిపోయింది. ఔన్స్‌కు 21.23 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గినా కూడా దేశీ మార్కెట్లో పసిడి రేటు స్థిరంగా కొనసాగడం గమనార్హం.
ఇకపోతే పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు జీఎస్టీ అదనం. ఇంకా బంగారం ధరలకు జువెలర్స్ ప్రాఫిట్ మార్జిన్, ఆభరణాల తయారీ చార్జీలు వంటివి కూడా అదనం అనే గమనించాలి. దీని వల్ల పసిడి రేట్లలో కొంత మేర వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల బంగారం కొనుగోలు చేయాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. కాగా బంగారం ధరలు వచ్చే ఏడాదిలో బాగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో బంగారం దిగుమతులు ఏకంగా 17.3 శాతం మేర క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో బంగారం దిగుమతులు 24 బిలియన్ డాలర్లకు తగ్గాయి. డిమాండ్ తగ్గడంతో దిగుమతులు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold price, Gold Price Today, Gold rate, Gold Rate Today, Silver price