చైనాను దాటి కరోనావైరస్ అటు దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్, భారత్‌లకు వ్యాపించడంతో, మదుపుదారులు తమ సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మరలుతున్నారు. ఫలితంగా బంగారం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పటికే తులం బంగారం ధర రూ.45 వేల దాటింది. హైదరాబాద్‌లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45706 గా పలుకుతోంది. ఇక అటు యూఎస్ మార్కెట్లో ఔన్సు(31.3 గ్రాములు) ధర 1673 డాలర్లుగా ఉంది. మరోవైపు యుఎస్ బాండ్ యీల్డ్ 10 సంవత్సరాల రికార్డు స్థాయికి పడిపోవడంతో పాటు. యూఎస్ ఫెడ్ రిజర్వ్ సైతం వడ్డీ రేట్లను అరశాతం తగ్గించింది. గురువారం యుఎస్ డో జోన్స్ సూచీ సైతం ఇటీవలి 3.5 శాతానికి పడిపోయింది. "ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడికి లోనవడంతో పాటు కరోనావైరస్ గురించి మార్కెట్లో ఎక్కువ ఆందోళనలు ఉన్నందున, స్పష్టంగా బంగారం వంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల్లోకి ద్రవ్యం ప్రవహిస్తున్నట్లు మేము చూస్తున్నాము" అని హై రిడ్జ్ ఫ్యూచర్స్, డైరెక్టర్ ఆఫ్ మెటల్స్ డేవిడ్ మేగర్ అన్నారు.
అంతేకాదు చైనా బయట పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాక బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్ల పతనానికి కరోనా మహమ్మారి ఆజ్యం పోసింది. దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్, బ్రెజిల్ లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తితో మార్కెట్ లో ఆందోళనలు పెరిగాయి. దీంతో మదుపరులు తమ సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు కదిలేందుకు కారణమవుతోంది. సెంట్రల్ బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థలకు తోడ్పడటానికి ద్రవ్య విధానాన్ని కాస్త వదులుగా చేయవచ్చనే అంచనాలు సైతం బంగారం లాభపడేందుకు దోహదపడుతోంది.
వైరస్ వ్యాప్తి వేగంగా ఉండటంతో పాటు చికిత్స అందుబాటులో లేకపోవడం గోల్డ్ మార్కెట్ సెంటిమెంట్ బలం పెంచింది. వచ్చే ఆరు నుండి పన్నెండు నెలల ధరల అంచనాల నుండి కూడా ఇది స్పష్టమవుతుంది. ఔన్స్ బంగారం విలువ 1,700 డాలర్లను మున్ముందు 1,780-1,800 డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రపంచ డిమాండ్‌లో భారత్, చైనా వాటా 50 శాతానికి మించి ఉంది. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం, అధిక ధర మరియు నెమ్మదిగా వృద్ధి చెందడం వలన చైనా వినియోగదారుల డిమాండ్ 2019 లో 15 శాతం పడిపోయింది. వైరస్ వ్యాప్తి రూపంలో దేశం ఇప్పుడు కొత్త సవాలును ఎదుర్కొంటోంది. మరోవైపు బంగారం రిటైల్ మార్కెట్లో తులం ధర రూ.75 వేలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold bars, Gold price down, Gold rate hyderabad, Gold rates