Gold Rate: బంగారం ధర మరోసారి తులం రూ.50 వేలకు పోతుందా...కారణాలు ఇవిగో..

Gold rate (ప్రతీకాత్మక చిత్రం)

దేశానికి ఆయువు పట్టులాంటి ముంబై, అలాగే మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటంతో, ఆ ఎఫెక్ట్ ఆర్థిక వ్యవస్థపై చూపే అవకాశం లేకపోలేదనే మాట వినిపిస్తోంది.

  • Share this:
    బంగారం ధరలు మరోసారి తులం 50 వేలు తాకే అవకాశం ఉందని బులియన్ మార్కెట్లో ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి. ముఖ్యంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు, దేశ వ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం ఉందనే వార్తలు జోరందుకోవడంతో మరోసారి ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భయపడుతున్నాయి. ముఖ్యంగా దేశానికి ఆయువు పట్టులాంటి ముంబై, అలాగే మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటంతో, ఆ ఎఫెక్ట్ ఆర్థిక వ్యవస్థపై చూపే అవకాశం లేకపోలేదనే మాట వినిపిస్తోంది. అయితే గత మూడు నెలలుగా బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఫలితంగా గోల్డ్ ధర 40 వేల దిగువకు సైతం వెళ్లే అవకాశం ఉందనే వార్తలు జోరందుకున్నాయి. కానీ పరిస్థితి మరోసారి రివర్స్ అయ్యే చాన్స్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 50 వేల పాయింట్ల ఎగువన ట్రేడ్ అవుతుంటే , నిఫ్టీ కూడా 15వేల పాయింట్ల సమీపంలో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి స్టాక్ మార్కెట్లు కరెక్షన్ కు గురయ్యే అవకాశం కనిపిస్తోందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఫలితంగా గోల్డ్ వైపు మదుపరులు తమ పెట్టుబడులను తరలించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే గోల్డ్ మరోసారం విపరీతంగా పెరిగే చాన్స్ లు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.

    అంతర్జాతీయ వైఖరి ఇది...

    బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాముల ధర 44,865 వద్ద ట్రేడవుతోంది. అయితే ఏప్రిల్ 1 న బంగారు ధరలు 10 గ్రాములకి 44,865 రూపాయలకు పలికింది. యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ యొక్క 2.25 ట్రిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల ప్రణాళిక, కరోనావైరస్ వ్యాప్తిని పరిమితం చేయడానికి దేశాలు విధించిన వదులుగా ఉన్న ద్రవ్య వైఖరి లాక్డౌన్ మద్దతు ఇచ్చాయి. మరోవైపు పసిడి లోహం MCX లో నాలుగు ట్రేడింగ్ సెషన్లలో మూడింటిలో పెరిగింది. వారానికి 125 రూపాయలు లేదా 0.28 శాతం లాభంతో ముగిసింది. మరోవైపు, కామెక్స్ బంగారం ఇదే కాలంలో 5.8 డాలర్లు లేదా 0.34 శాతం పడిపోయింది. రిటైల్ మార్కెట్లో, బులియన్ మెటల్ గురువారం 10 గ్రాములకి రూ .44,919 వద్ద ముగిసింది, 1.65 శాతం పెరిగి, ప్రపంచ సానుకూల ధోరణిని గుర్తించింది. దేశీయ మార్కెట్లో పసుపు లోహం వారంలో 264 లేదా 0.59 శాతం పెరిగింది.

    మరోసారం బంగారం 50 వేలు అవుతుందా..

    ప్రస్తుతం ట్రెండ్ ను బట్టి చూస్తుంటే, కరోనా కేసులు గత సంవత్సరం లాగానే విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధర మరోసారి పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇధే ధోరణి కొనసాగితే మరో రెండు మూడు వారాల్లో బంగారం అరలక్ష అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
    Published by:Krishna Adithya
    First published: