news18-telugu
Updated: September 16, 2019, 6:23 PM IST
(ప్రతీకాత్మక చిత్రం)
అంతర్జాతీయంగా బంగారం ధరలు మరోసారి పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా గరిష్ట స్థాయి నుంచి పతనమైన బంగారం ధరలు, తాజాగా అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలతో పసిడి పరుగులు తీయడం ప్రారంభించింది. ముఖ్యంగా సౌదీ అరేబియాలోని అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ అరాంకో కంపెనీపై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడి చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా చమురు వెలికితీతపై ఎఫెక్ట్ పడింది. దీంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతేకాదు ఈ ఉగ్రదాడుల వెనుక ఇరాన్ హస్తం ఉందని అమెరికా ప్రకటించడంతో గల్ఫ్ ప్రాంతంలో చిచ్చు మొదలైంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో కలకలం రేగింది. ఫలితంగా దేశీయంగా డాలర్‌కు ప్రతిగా రూపాయి విలువ ఏకంగా రూ.71.67కూ పతనమైంది. ఈ ప్రభావం కూడా పసిడి ధరలపై పడింది.
అంతేకాదు అంతర్జాతీయ టెన్షన్స్ నేపథ్యంలో పసిడి మార్కెట్ పై మదుపరులు తన ఇన్వెస్ట్ మెంట్లను తరలించడంతో ఒక్కసారిగా బంగారం ధరలు ఊపందుకున్నాయి. ఇక దేశీయ మార్కెట్లలో సైతం పసిడి ఊపందుకుంది. చూస్తోంది. స్పాట్ మార్కెట్లో ఢిల్లీలో బంగారం ధరలు పెరిగాయి. 24 కేరట్ల పది గ్రాములు పసిడి ధర ఏకంగా రూ.460 పెరిగింది. అలాగే వెండిధర సైతం ఒక కేజీపై రూ.1096 పెరుగుల నమోదు చేసింది. హైదరాబాద్ లో బంగారం ధర రూ.39,143గా నమోదైంది. ముంబైలో బంగారం ధరలో రూ.39,112గా నమోదైంది.
Published by:
Krishna Adithya
First published:
September 16, 2019, 6:15 PM IST