Gold Price Today : భారీగా తగ్గిన బంగారం ధర...శ్రావణమాసంలో కలిసి రానున్న పసిడి...

హైదరాబాద్ మార్కెట్‌లో 24 కేరట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.430 తగ్గి రూ.36,160కు క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.230 తగ్గి రూ.33,150కు తగ్గింది.

news18-telugu
Updated: August 2, 2019, 9:58 PM IST
Gold Price Today : భారీగా తగ్గిన బంగారం ధర...శ్రావణమాసంలో కలిసి రానున్న పసిడి...
Gold Price: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర... (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 2, 2019, 9:58 PM IST
శ్రావణ మాసం ప్రారంభం రోజే బంగారం భారీగా పతనమైంది. వర్తకులు, రిటైల్ కస్టమర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి ధర భారీగా పతనమైంది. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్‌లో 24 కేరట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.430 తగ్గి రూ.36,160కు క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.230 తగ్గి రూ.33,150కు తగ్గింది. అదే సమయంలో వెండి ధర మాత్రం కిలోకు రూ.44,965 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నప్పటికీ దేశీయంగా డిమాండ్ తగ్గిపోయింది. ముఖ్యంగా బంగారం ధరలు బడ్జెట్ అనంతరం అమాంతం పెరిగిపోవడం కారణం ఒకటి అలాగే దేశ వ్యాప్తంగా గ్రామీణ డిమాండ్ కనిష్ట స్థాయికి చేరుకోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. అలాగే రుతుపవనాలు సైతం ఈ సారి మందగమనంతో సాగడం కూడా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...