• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOLD RATE IN HYDERABAD TODAY 23RD DEC 2019 GET 22 CARAT 24 KARAT GOLD RATE IN HYDERABAD MK

Gold Rate: పెరుగుతున్న బంగారం ధర...మరోసారి పసిడి ధరలు జంప్

Gold Rate: పెరుగుతున్న బంగారం ధర...మరోసారి పసిడి ధరలు జంప్

Gold Price (ప్రతీకాత్మక చిత్రం)

ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. ఎంసిఎక్స్‌ లో 10 గ్రాముల బంగారంపై రూ.110 పెరిగి రూ. 38,101 కి చేరింది. అయితే 2019 వ సంత్సరంలో మాత్రం బంగారం ధర ఏకంగా 20 శాతం పెరిగింది.

  • Last Updated:
  • Share this:
    న్యూయార్క్‌ మర్కంటైల్‌ లో పసిడి ధర ఔన్స్‌కు 1,482 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలు ఉన్నప్పటికీ, అనిశ్చితిని ధీటుగా ఎదుర్కొనడానికి పసిడి కొనుగోళ్లవైపు మొగ్గుచూపాలని ఇరాన్, మలేషియా, టర్కీ, కతార్‌లు భావిస్తున్నట్లు స్వయంగా మలేషియా ప్రధానమంత్రి మహతీర్‌ మహ్మద్‌ ప్రకటించడం ఇక్కడ గమనార్హం. ఈ కారణంగా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. ఎంసిఎక్స్‌ లో 10 గ్రాముల బంగారంపై రూ.110 పెరిగి రూ. 38,101 కి చేరింది. అయితే 2019 వ సంత్సరంలో మాత్రం బంగారం ధర ఏకంగా 20 శాతం పెరిగింది. ప్రస్తుతం పెరిగిన ధర సెప్టెంబర్‌ నెలలోని గరిష్ట రికార్డ్‌ రూ.40వేలతో పోల్చుకుంటే రూ.2 వేలు కంటే తక్కువగానే ఉంది. అయినప్పటికీ బంగారం ధర భారీగానే పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
    Published by:Krishna Adithya
    First published: