Gold Rate Today | అందనంత ఎత్తుకు బంగారం...చుక్కలనింటిన పసిడి ధరలు...

24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ రూ.36660 ఎగువకు ఎగిసింది. అదేసమయంలో 22 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.33690 కు ఎగిసింది. బంగారం ధర నూతన గరిష్ట స్థాయిలను నమోదు చేస్తూ ఎదుగుతోంది.

news18-telugu
Updated: July 19, 2019, 6:37 PM IST
Gold Rate Today | అందనంత ఎత్తుకు బంగారం...చుక్కలనింటిన పసిడి ధరలు...
(ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 19, 2019, 6:37 PM IST
బంగారం ధరలు సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళుతున్నాయి. ఆషాఢంలోనూ పసిడి పరుగులు పెడుతోంది. 24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ రూ.36660 ఎగువకు ఎగిసింది. అదేసమయంలో 22 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.33690 కు ఎగిసింది. బంగారం ధర నూతన గరిష్ట స్థాయిలను నమోదు చేస్తూ ఎదుగుతోంది. ఎంఎంటీసీ విక్రయిస్తున్న 999 ప్యూరిటీ బంగారం 10 గ్రాముల నాణెం ధర ఏకంగా 40250 తాకింది. ఇక బంగారంతో పాటు మరో విలువైన లోహం వెండి ధరలు సైతం చుక్కలను తాకుతున్నాయి. కేజీ వెండి ధర రూ.49170గా పలికింది.

మరోవైపు ప్రపంచ మార్కెట్లలో బంగారం ధర 6 సంవత్సరాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత వేయనుందనే అంచనా భయాలతో అమెరికాలో ఔన్స్ పసిడి ధర 1450 డాలర్లను దాటింది. రానున్న రోజుల్లో పసిడి మరింత పెరిగే ఛాన్స్ లు పుష్కలంగా ఉన్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలతో పాటు, అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే పుత్తడి రికార్డులు బద్దలు కొడుతోందని అంచనా వేస్తున్నారు.

First published: July 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...