
Gold rate:
(ప్రతీకాత్మక చిత్రం)
అటు దేశీయంగా కూడా బంగారం ధరలు హైదరాబాద్ 10 గ్రాములు (మేలిమి బంగారం) రూ.39527 కాగా, విజయవాడలో రూ.39530గా పలికింది. కాగా జనవరి నాటికి పసిడి ధరలు మరింత పతనమయ్యే అవకాశం ఉందని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు.
బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. అంతర్జాతీయంగా చూసినట్లయితే న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం (28.5 గ్రాములు) ధర ఏకంగా 1455 డాలర్లకు పడిపోయింది. సరిగ్గా రెండు నెలల క్రితం అంటే ఆగస్టులో ఇదే ధర దాదాపు 1530 డాలర్లు తాకి రికార్డు సృష్టించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇతర మార్కెట్లు పుంజుకుంటున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అంటే దాదాపు 70 డాలర్ల మేర ఔన్సు బంగారం ధర తగ్గుతూ వచ్చింది. అయితే ఇదే ఊపు కొనసాగితే సమీప భవిష్యత్తులో బంగారం ధర 1430 డాలర్లకు పతనమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అటు దేశీయంగా కూడా బంగారం ధరలు హైదరాబాద్ 10 గ్రాములు (మేలిమి బంగారం) రూ.39527 కాగా, విజయవాడలో రూ.39530గా పలికింది. కాగా జనవరి నాటికి పసిడి ధరలు మరింత పతనమయ్యే అవకాశం ఉందని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు.
Published by:Krishna Adithya
First published:November 13, 2019, 15:35 IST