Gold Rate: వామ్మో...మరోసారి కొండెక్కిన బంగారం...ఒక్క రోజే తులం పసిడి ధర రూ.1000 జంప్

అంతర్జాతీయంగా ధరలు పెరుగుదలతో బంగారం ధర భారీగా పెరిగింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్స్‌) బంగారం ధర ఒక్కరోజే రూ.953 పెరిగి రూ.44,472కి చేరింది.

news18-telugu
Updated: February 24, 2020, 5:08 PM IST
Gold Rate: వామ్మో...మరోసారి కొండెక్కిన బంగారం...ఒక్క రోజే తులం పసిడి ధర రూ.1000 జంప్
Gold Price Today: (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అంతర్జాతీయంగా ధరలు పెరుగుదలతో బంగారం ధర భారీగా పెరిగింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్స్‌) బంగారం ధర ఒక్కరోజే రూ.953 పెరిగి రూ.44,472కి చేరింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో దీని ధర రూ.43,519గా ఉంది. అటు న్యూయార్క్ బులియన్ మార్కెట్లో బంగారం ఔన్సు బంగారం ధర 1682 డాలర్లకు చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణించడంతో పాటు కరోనా వైరస్ ప్రభావం సైతం బంగారం ధరలు పెరుగుదలకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పేర్కొంది. సోమవారం రూపాయి మారకం విలువ 22 పైసలు మేర క్షీణించడంతో పాటు కరోనా వైరస్‌ దక్షిణ కొరియా, మధ్య ఆసియా, ఇటలీ దేశాల్లో కనిపించడంతో బంగారం ధరలు మరింత పెరిగాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో సార్స్ వైరస్ కన్నా ప్రస్తుత కరోనా వైరస్ మరింత భీతావహ స్థితి కల్పించనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అటు చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ప్రభావితం చేసే శక్తిగా ఉంది. ఫలితంగా దీని ప్రభావం అంతర్జాతీయ వాణిజ్యంపై స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు చైనా జీడీపీ సైతం 2020లో 5.6శాతానికి పరిమితం కానుంది. అయితే చైనా ఈక్విటీ మార్కెట్లలోని బేరిష్ ట్రెండ్ అటు బంగారానికి మాత్రం బుల్లిష్ ధోరణిని పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం అంత తొందరగా బంగారం వైపు మదుపరులు తమ పెట్టుబడులు తరలించకపోయినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం మరింత ధర పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి.

First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు