బంగారం ధర మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో పాటు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 20 తగ్గి రూ. 40,670 పలుకుతుండగా, 22 క్యారట్ల బంగారం ధర రూ. 30 తగ్గి రూ. 37,270 వద్ద స్థిరపడింది. పసిడిబాటలోనే వెండి సైతం రూ. 50 తగ్గి రూ. 49,300 వద్ద స్థిరపడింది. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విజయవాడ, విశాఖపట్నంలోనూ 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 40,670 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర రూ. 37,270 గా ఉంది. బంగారం ధరలు గత రెండు వారాలుగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గడానికి కారణమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold bars, Gold rate hyderabad, Gold rates