బంగారం ధరలు దిగివస్తున్నాయి. భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు (23.01.2020) తగ్గుముఖం పట్టాయి. అటు హైదరాబాద్ మార్కెట్లో సైతం బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 350 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.41,480 దిగివచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 38,020 రూపాయల వద్దకు చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా కేజీకి ఏకంగా రూ.600 తగ్గాయి. దీంతో కేజీ వెండిధర 49,600 నుంచి 49,000 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. వెండి ధర 49,000 రూపాయలకు పడిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold jewellery, Gold price down, Gold prices, Gold rate hyderabad