Gold Rate: బంగారం ధరలు దిగివస్తున్నాయి...పసిడిప్రేమికులకు బిగ్ న్యూస్

Gold Rate: 24 క్యారెట్ల బంగారం ధర 290 రూపాయలు తగ్గగా, పసిడి ధర 10 గ్రాములకు 42,530 నుంచి 42,240 రూపాయలకు దిగివచ్చింది.

Krishna Adithya | news18-telugu
Updated: February 12, 2020, 11:29 PM IST
Gold Rate: బంగారం ధరలు దిగివస్తున్నాయి...పసిడిప్రేమికులకు బిగ్ న్యూస్
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం ధరలు వరుసగా రెండోరోజు కూడా తగ్గాయి. నిన్న స్వల్ప తగ్గుదల నమోదు చేసిన బంగారం ఈరోజు మరింత కిందికి దిగివచ్చింది. హైదరాబాద్ లో బుధవారం 24 క్యారెట్ల బంగారం ధర 290 రూపాయలు తగ్గగా, పసిడి ధర 10 గ్రాములకు 42,530 నుంచి 42,240 రూపాయలకు దిగివచ్చింది. ఇక, 22 క్యారెట్ల బంగారం ధర కూడా 290 రూపాయలు తగ్గింది. దీంతో బంగారం 38,980 నుంచి 38,690 రూపాయలకు చేరింది. అలాగే వెండి ధరలు ఈరోజు అదే స్థాయిలో కిందికి దిగొచ్చాయి. కేజీ వెండి ధర 300 రూపాయలు తగ్గింది. దీంతో .49,300 నుంచి 49,000 రూపాయలకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం వెండి ధరల పరిస్థితి ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.290 తగ్గుదలతో 10 గ్రాములకు 38,690కు చేరింది. వెండి ధర 49,000 రూపాయలుగా అయింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1560 డాలర్లకు దిగివచ్చింది.

First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు