• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOLD RATE IN HYDERABAD FOR 22 KARAT AND 24 KARAT ON 0501 CHECK OUT HYDERABAD GOLD PRICE MK

Gold Rate: తులం బంగారం రూ.50 వేలకు పరుగులు...నగలు కొంటున్నారా...అయితే జాగ్రత్త...

Gold Rate: తులం బంగారం రూ.50 వేలకు పరుగులు...నగలు కొంటున్నారా...అయితే జాగ్రత్త...

Gold Price (ప్రతీకాత్మక చిత్రం)

అమెరికా- ఇరాన్ యుద్ధ భయాల నేపథ్యంలో బంగారం దేశీయ మార్కెట్లో తులం ధర రూ. 50 వేలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాల కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

  • Share this:
    బంగారం రేట్లు రోజు రోజుకి ఆకాశం తాకుతున్నాయి. అమెరికా- ఇరాన్ యుద్ధ భయాల నేపథ్యంలో బంగారం దేశీయ మార్కెట్లో తులం ధర రూ. 50 వేలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాల కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే కొత్త సంవత్సరంలో మీరు మదుపుచేయాల్సిన ఆస్తిలో బంగారం కూడా ఒకటి. ముఖ్యంగా బంగారు షోరూంల వారి ఆఫర్ల మోజులో పడి షాపులకు వెళితే, మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే బంగారం కొనేసమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక లుక్కేద్దాం. బంగారం కొనేటప్పుడు ముఖ్యంగా చూడాల్సింది దాని నాణ్యత, పసిడి నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. 24 కేరట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం అంటారు. అయితే బంగారు దుకాణాల్లో మనం కొనే బంగారు ఆభరణాలు సాధారణంగా 22 కేరట్ల బంగారం ఉంటుంది. నాణ్యతను బట్టి బంగారం 18, 14,12,10 కేరట్లలో దొరుకుతుంది. అయితే 22 కేరట్ల బంగారంలో 91.6 శాతం బంగారం ఉంటుంది. దీన్నే 916 బంగారం అంటారు. అయితే 18 కేరట్ల బంగారంలో కేవలం 75 శాతం బంగారం మాత్రమే ఉంటుంది. కొంత మంది దుకాణదారులు 22 కేరట్ల బంగారం అని చెప్పి 18కేరట్ల బంగారంతో చేసిన నగలు అంటగడుతుంటారు. అలాంటప్పుడు మనం కొనే నగలపై తప్పనిసరిగా బీఐఎస్ హాల్ మార్క్ ఉందా లేదా అనేది సరిచూసుకోవాలి. ఎంత చిన్న ఆభరణం (ఒక గ్రాము బరువు ఉన్నా) కొన్నప్పటికీ ఈ హాల్ మార్క్ తప్పనిసరి. 916 బీఐఎస్ హాల్ మార్క్ ఉన్న నగలనే వర్తకుల నుంచి డిమాండ్ చేసి కొనుగోలు చేయాలి.

    Gold price today, Gold rate today, Latest gold price, gold price hyderabad, Silver price today, Silver rate today, Latest Silver price, Silver price hyderabad, బంగారం ధర, తులం బంగారం రేటు, గోల్డ్ రేట్, హైదరాబాద్ గోల్డ్ రేట్, హైదరాబాద్ గోల్డ్ ధర, వెండి ధర, తులం వెండి ధర
    (ప్రతీకాత్మక చిత్రం)


    బంగారం కొనుగోలులో చూడాల్సిన మరో అంశం మజూరి, తరుగుదల, ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆభరణం తరుగును బిల్లులో కలపడం సహజం. అయితే వీలైనంత తక్కుగా మజూరీ, తరుగు ఉండేలా వర్తకులను నుంచి డిమాండ్ చేయాలి. అలాగే బంగారంలో తూకం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గ్రాముల విషయంలో తేడా వచ్చిందంటే బిల్లు భారీగా పెరిగిపోతుంది. అయితే మిల్లీగ్రాములతో సహా లెక్కించాలని డిమాండ్ చేయాలి. అలాగే సాధారణంగా ఆభరణాల్లో రాళ్లు పొదిగిఉన్నప్పుడు వాటిని కలిపి బరువు తూస్తుంటారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాళ్లను సెపరేట్ చేసి బరువు తూయమని డిమాండ్ చేయాలి.

    Sovereign Gold Bond Scheme 2019-20 Series VII, Sovereign Gold Bond Scheme 2019-20, Sovereign Gold Bond Scheme 2019-20 Series VII price, Sovereign Gold Bond Scheme benefits, Sovereign Gold Bond Scheme, Sovereign Gold Bond Scheme RBI, Sovereign Gold Bond price, సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2019-20 సిరీస్ VII, సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2019-20, సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2019-20 సిరీస్ VII ధర, సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ లాభాలు, సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్, సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సావరిన్ గోల్డ్ బాండ్ ధర
    (ప్రతీకాత్మక చిత్రం)


    ఇక అన్నింటి కన్నా ముఖ్యమైనది రశీదు. బంగారు ఆభరణాలు కొన్న తర్వాత రశీదు జాగ్రత్తగా భద్రపరుచుకోవడం తప్పనిసరి. కిరాణా సరుకుల బిల్లు రశీదులా తీసిపారేయకుండా, అత్యంత జాగ్రత్తగా దాచుకోవాలి. ఎందుకుంటే మున్ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా రశీదు ఉంటే జవాబుదారీతనం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని దుకాణాలు 22 కేరట్ల ఆభరణమని చెప్పి 18 కేరట్ల ఆభరణం అంటగడతారు. అలాంటి సమయంలో మూడో వ్యక్తి చేత నగల నాణ్యతను టెస్ట్ చేయించినప్పుడు అసలు విషయం బయటపడుతుంది. అప్పుడు రశీదుతో వినియోగదారుల హక్కుల ఫోరం ఆశ్రయించవచ్చు.
    Published by:Krishna Adithya
    First published: