Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...పండగకు పసిడి దిగి వస్తుందా...?

Gold Rate: . హైదరాబాద్ మార్కెట్లో బంగారం (24 కేరట్లు) 10గ్రాముల ధర రూ.39520 పలకగా, ముంబైలో బంగారం ధర 39536గా పలుకుతోంది. చెన్నైలో రూ.39537గా నమోదైంది.

news18-telugu
Updated: September 6, 2019, 3:41 PM IST
Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...పండగకు పసిడి దిగి వస్తుందా...?
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
news18-telugu
Updated: September 6, 2019, 3:41 PM IST
Gold Rate: బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గడంతో దేశీయ మార్కెట్లలో సైతం పసడిధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం (24 కేరట్లు) 10గ్రాముల ధర రూ.39520 పలకగా, ముంబైలో బంగారం ధర 39536గా పలుకుతోంది. చెన్నైలో రూ.39537గా నమోదైంది. ఇక ఏపీలోని విజయవాడలో బంగారం ధర రూ.39544 పలకగా, వైజాగ్ లో రూ.39546 గా నమోదైంది. అలాగే నెల్లూరు రూ.39576గా పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో చూస్తే న్యూయార్క్ మార్కెట్లో పసిడి ఔన్సు ధర 1507 డాలర్లు పలుకుతోంది. ఇదిలా ఉంటే రానున్న ఫెస్టివల్ సీజన్ నాటికి బంగారం ధరలు పెరిగే చాన్స్ ఉందని బులియన్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వచ్చిన ధరల తగ్గుదల స్వల్పకాలికమేనని చెబుతున్నారు.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...