Gold Rate : భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు తగ్గడంతో వినియోగదారులు కొనుగోళ్లు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

news18-telugu
Updated: October 1, 2019, 2:57 PM IST
Gold Rate : భారీగా తగ్గిన బంగారం ధర
ఫ్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 1, 2019, 2:57 PM IST
కొద్దిరోజుల నుంచి భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా బంగారం ధర ఒకే రోజు రూ. 600లకు పైగా దిగొచ్చి... వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. మంగళవారం అక్టోబర్ 1న గోల్డ్ రేట్ భారీగా తగ్గింది. ఒక్క రోజే దాదాపు భారీ తగ్గుదల నమోదు చేసింది. దీంతో బంగారం ఎక్కడ తమకు అందకుండా పోతుందో అని టెన్షన్ పడుతున్న వినియోగదారులకు కాస్త ఊరట లభించినట్టయ్యింది. బంగారం ధరలు తగ్గడంతో వినియోగదారులు కొనుగోళ్లు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం10 గ్రాముల ధర రూ.38,280‌గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు, 10 గ్రాముల ధర రూ.35,280 దగ్గర కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాములు రూ.38,240 ఉండగా... ముంబైలో10 గ్రాములు రూ.38,205గా ఉంది. చెన్నైలో మాత్రం ఈ రేటు కాస్త ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.48,500 వద్ద కొనసాగుతోంది. అయితే బంగారం ధరలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మార్కెట్లో రూపాయి విలువ బలపడుతుండటంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా కాకపోవడమే ధరలు తగ్గడానికి కారణమని అంచనా వేస్తున్నాయి.First published: October 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...