Gold Rate: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర

Gold Rate Today | సోమవారం 99.9 స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.34,270 కాగా, 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.34,100. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.26,800.

news18-telugu
Updated: June 24, 2019, 6:20 PM IST
Gold Rate: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర
Gold Rate: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 24, 2019, 6:20 PM IST
ఇటీవల రూ.34 వేల మార్క్ దాటిన బంగారం ధర కాస్త తగ్గింది. గత శనివారం బంగారం ధర స్వల్పంగా పెరిగితే సోమవారం నాడు బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గడం విశేషం. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ కాస్త తగ్గడమే బంగారం ధర తగ్గడానికి కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.34,270 కాగా, 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.34,100. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.26,800. ఇక అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ బంగారం ధర 1,404.92 డాలర్లు.

Read This: బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఓవైపు బంగారం ధర స్వల్పంగా తగ్గితే వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.90 పెరిగింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటమే వెండి ధర పెరగడానికి కారణం. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.39,090. మార్కెట్‌లో 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.80,000 కాగా అమ్మకం ధర రూ.81,000. అంతర్జాతీయంగా చూస్తే న్యూయార్క్‌లో ఔన్స్ వెండి ధర 15.36 డాలర్లు.

Revolt RV400: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలక్ట్రిక్ బైక్




ఇవి కూడా చదవండి:

BSNL: ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు
Loading...
Good News: పెరిగిన కేబుల్ ధరలపై దృష్టిపెట్టిన ట్రాయ్

Electric Vehicles: తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు... కారణమిదే
First published: June 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...