Home /News /business /

GOLD RATE AND SILVER RATE 9 JUNE 2021 GOLD AND SILVER PRICE HIKE THIS TIME DUE TO STOCK MARKETS EFFECT HERE IS THE LATEST UPDATES NK

Gold Rate 9-6-2021: బంగారం జోరు కంటిన్యూ... 69 రోజుల్లో రూ.5,230 పెరుగుదల

బంగారం జోరు కంటిన్యూ (ప్రతీకాత్మక చిత్రం)

బంగారం జోరు కంటిన్యూ (ప్రతీకాత్మక చిత్రం)

Gold and Silver rate 9-6-2021: బంగారం ధరలు వారంలో ఒకట్రెండుసార్లు తగ్గినట్లు తగ్గి... కంటిన్యూగా పెరుగుతూనే ఉన్నాయి. పెట్టుబడులు పెరుగుతుండటమే ఇందుకు కారణం అంటున్నారు.

    Gold and Silver price 9-6-2021: స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాల్లోకి జారుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం... ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడమే. నెల రోజులుగా షేర్ల ధరలు కాస్త పెరగడంతో... ఒక్కసారిగా అమ్మకాలకు దిగారు. దాంతో... స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఐతే... బంగారం విషయంలో మాత్రం ఇలా జరగలేదు. స్టాక్ మార్కెట్లలో పొందిన డబ్బును తీసుకెళ్లి... బంగారంపై పెట్టినట్లు కనిపిస్తోంది. అందువల్ల నిన్న బంగారం ధరలు కాస్త పెరిగాయి. వెండి కూడా అదే రూట్లో వెళ్లింది. అది కూడా పెరిగింది. ఇది కంటిన్యూ అవుతుందనీ... మళ్లీ గోల్డ్ ధరలు రూ.60వేలకు చేరతాయని కొందరు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

    అక్కడే ఊగిసలాట:
    ప్రస్తుతం బంగారం ధరలు రూ.50వేల దగ్గర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడు (మంగళవారం నాటికి)... రూ.45,900 ఉంది. 69 రోజుల్లో ధర రూ.4,800 పెరిగింది. అలాగే.. 24 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా... ఇప్పుడు రూ.50,070 ఉంది. అంటే 69 రోజుల్లో ధర రూ.5,230 పెరిగింది. నేటి ఉదయం రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

    Gold Price 9-6-2021:
    గత 10 రోజుల్లో బంగారం ధర 7 సార్లు పెరగగా... 2 సార్లు తగ్గింది. 1 సారి స్థిరంగా ఉంది. నిన్న ధర కొద్దిగా పెరిగింది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,590 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.36,720 ఉంది. నిన్న తులం ధర రూ.80 పెరిగింది. ఇక 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.45,900 ఉంది నిన్న ధర రూ.100 పెరిగింది.

    పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.5,007 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.40,056 ఉంది. నిన్న తులం ధర రూ.80 పెరిగింది. ఇక 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.50,070 ఉంది. నిన్న ధర రూ.100 పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి.

    Silver Price 9-6-2021:
    వెండి ధరలు గత 10 రోజుల్లో 5 సార్లు పెరగగా... 4 సార్లు తగ్గాయి. 1 సారి స్థిరంగా ఉన్నాయి. నిన్న పెరిగాయి. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.76.30 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.610.40 ఉంది. నిన్న ధర రూ.4 పెరిగింది. అదే 10 గ్రాములు కావాలంటే... ధర రూ.763 ఉంది. నిన్న ధర రూ.50 పెరిగింది. 100 గ్రాములు ధర రూ.7,630 ఉండగా... కేజీ వెండి ధర... రూ.76,300 ఉంది. గత 6 నెలల్లో వెండి ధర రూ.8,300 పెరిగింది.

    ఇది కూడా చదవండి: Horoscope 9-6-2021: రాశి ఫలాలు... ఈ రాశుల వారు కీడెంచి.. మేలెంచాలి

    స్టా్క్ మార్కెట్లలో దూకుడు:
    దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయి. వ్యాక్సిన్లను అందరికీ ఉచితంగా ఇస్తామని కేంద్రం చెప్పింది. నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయి. చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్లను ఎత్తివేస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల ఇండియాలో ఆర్థిక వ్యవహారాలు తిరిగి పుంజుకుంటాయి. అందువల్ల స్టాక్ మార్కెట్లపై ఇన్వెస్టర్లకు నమ్మకం పెరగనుంది. అందువల్ల స్టాక్ మార్కెట్లు మళ్లీ దూసుకెళ్తాయనే నమ్మకం ఆర్థిక నిపుణుల్లో ఉంది. అదే జరిగితే... బంగారం ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Gold price, Gold rate, Silver price, Silver rate

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు