హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold price: బంగారం ధర భారీగా పతనం...కొత్త సంవత్సరం తులం పసిడి రేట్ తెలిస్తే ఊపిరి ఆడదు..

Gold price: బంగారం ధర భారీగా పతనం...కొత్త సంవత్సరం తులం పసిడి రేట్ తెలిస్తే ఊపిరి ఆడదు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ముంబైకి చెందిన బంగారం వ్యాపారి అశోక్ జైన్(Ashok Jain) మాట్లాడుతూ“ బంగారం(Gold) ధరలు పెరగడంతో డిమాండ్ బాగా తగ్గింది. ధరల పెరుగుదల కారణంగా రిటైల్ కొనుగోలుదారులు తమ కొనుగోళ్ల(Buying)ను వాయిదా వేసుకుంటున్నారు.

భారతీయుల్లో బంగారానికి ఉన్న క్రేజ్​ తెలిసిందే. శుభకార్యలకు, పండుగలకు, పర్వదినాలకు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అంతేకాక, దీన్ని సురక్షిత పెట్టుబడి మార్గంగా భావిస్తుంటారు. అయితే, గత కొద్ది నెలలుగా బులియన్​ మార్కెట్​లో బంగారం(Gold) ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ  ప్రభావం మన దేశంపై కూడా పడింది. తద్వారా, గత కొద్ది నెలలుగా బంగారం ధరలు(gold prices) పైపైకి వెళ్తున్నాయి. కాగా, తమ కొనుగోళ్లను పెంచుకునేందుకు భారతీయ జ్యువలరీ షాపు యజమానులు ధంతేరాస్ పర్వదినాన ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కరోనా(corona)తో ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో ఆశించిన మేర కొనుగోళ్లు జరగలేదు. దీంతో​ ఆరు వారాల తర్వాత మరోసారి డిస్కౌంట్‌(discount )లతో ముందుకొస్తున్నాయి. కాగా, ప్రస్తుతం భారత మార్కెట్​లో 10 గ్రాముల బంగారం ధర రూ.50,642 లకు చేరుకుంది. తద్వారా నవంబర్​ 18 తర్వాత మరోసారి అత్యధిక స్థాయి ధరను తాకింది.

దీనిపై ముంబైకి చెందిన బంగారం వ్యాపారి అశోక్ జైన్(Ashok Jain) మాట్లాడుతూ“ బంగారం(Gold) ధరలు పెరగడంతో డిమాండ్ బాగా తగ్గింది. ధరల పెరుగుదల కారణంగా రిటైల్ కొనుగోలుదారులు తమ కొనుగోళ్ల(Buying)ను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో, అమ్మకాలను పెంచుకునేందుకు డీలర్లు(Dealers ) జౌన్సు బంగారంపై 1 డాలర్ల వరకు డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఈ డిస్కౌంట్ల(discount)లో 10 శాతం దిగుమతి సుంకం, 3 శాతం అమ్మకపు పన్ను వంటివి ఉన్నాయి. తద్వారా గత వారం బంగారంపై $ 2.5 ధర తగ్గింపు లభిస్తుంది.” అని అన్నారు.

చైనాలో భారీగా పడిపోయిన బంగారం కొనుగోళ్లు..

‘‘బంగారం వినియోగంలో ప్రపంచంలోనే టాప్​లో ఉన్న చైనాలో కరోనావైరస్ కారణంగా కొనుగోళ్లు గణనీయంగా పడిపోయింది. కాగా, కరోనా వైరస్​(coronavirus)తో చైనా ఇంకా పోరాడుతూనే ఉంది. అందువల్ల, ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బులను పొదుపు చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటున్నారు. దీంతో బంగారం కొనుగోళ్లు భారీగా పడిపోయాయి." అని హాంకాంగ్‌లోని లీ చెయోంగ్ గోల్డ్ డీలర్ల చీఫ్ డీలర్ రోనాల్డ్ తెంగ్ చెప్పారు. దీంతో, కొనుగోలుదారులను ఆకర్షించడానికి చైనా డీలర్​షిప్​లు, ఔన్స్‌ (ounce)బంగారంపై $ 19- నుంచి $ 24 డిస్కౌంట్​ను ప్రకటించగా, గత వారం $ 16- నుంచి $ 20 డిస్కౌంట్లను అమలు చేశారు. ఈ డిస్కౌంట్లతో ఏడాది చివరికల్లా తమ స్టాక్​ క్లియర్​ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని హెరాయస్ మెటల్స్ హాంకాంగ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ డిక్ పూన్(Dick Poon) అభిప్రాయపడ్డారు. కాగా, కరోనా ఎఫెక్ట్​, ధరల పెరుగుదలతో సింగపూర్‌, జపాన్‌ దేశాల్లో బంగారం డిమాండ్ తగ్గుతూనే ఉంది.

First published:

Tags: Gold prices, Gold rate hyderabad

ఉత్తమ కథలు