GOLD PRICES TODAY SURGE TO NEAR 3 MONTH HIGH EYE RS 50 000 PER 10 GRAM GH VB
Gold Prices: మూడు నెలల గరిష్టానికి చేరుకున్న బంగారం ధరలు.. దీనికి కారణం అదే అంటున్న నిపుణులు..
(ప్రతీకాత్మక చిత్రం)
పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. నిన్న బంగారం ధర గత 3 నెలల గరిష్టానికి చేరుకుంది. భారత్‌లో బంగారం ధర రూ. 50 వేల మార్క్‌ను మళ్లీ దాటి ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. భవిష్యత్తులో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు.
పసిడి(Gold) ధరలు పరుగులు పెడుతున్నాయి. నిన్న బంగారం ధర గత 3 నెలల గరిష్టానికి చేరుకుంది. భారత్‌లో బంగారం ధర రూ. 50 వేల మార్క్‌ను మళ్లీ దాటి ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. భవిష్యత్తులో(Future) పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు. ఉక్రెయిన్ చుట్టూ నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధర పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. ఎంసీఎక్స్‌లో 22 క్యారెట్ల బంగారం ఫ్యూచర్స్ 0.8% పెరిగి 3 నెలల గరిష్ట స్థాయి రూ. 49,506కి చేరుకోగా, వెండి కిలోకు 1% పెరిగి రూ. 63,630కి చేరుకుంది. ఇతర విలువైన లోహాల్లో ముఖ్యమైన వెండి ఔన్స్‌కు 0.7% పెరిగి $23.74కి చేరుకోగా, ప్లాటినం 0.8% పెరిగి $1,036.14 వద్ద స్థిరపడింది. మరోవైపు, గ్లోబల్ మార్కెట్లలో(Global Market) స్పాట్ బంగారం ఔన్సుకు $1,859కి చేరుకుంది. అయితే, డాలర్, కరెన్సీలు లాభాలను కలిగి ఉన్నందున ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
"డాలర్ పరంగా రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు ధరలలో బలం కారణంగా బంగారం, వెండి ధరలు ఈ వారం సానుకూలంగా ఉంటాయని మేము ఆశిస్తున్నాం. బంగారం ట్రాయ్ ఔన్స్ గరిష్టంగా $1,884, వెండి ట్రాయ్ ఔన్స్ గరిష్టంగా $24 చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. బంగారం ధరలు $1845 నుంచి $-1834 మధ్య కొనసాగే అవకాశం ఉంది. ట్రాయ్ ఔన్సు రెసిస్టెన్స్ $1877 నుంచి $ 1892 వద్ద స్థిరంగా కొనసాగనుంది. వెండి $23.30 నుంచి 23.10 వద్ద స్థిరంగా కొనసాగనుంది. ప్రతి ట్రాయ్ ఔన్స్‌కు రెసిస్టన్స్ $23.80 నుంచి 24.00 వద్ద ఉంటుంది." అని మెహతా ఈక్విటీస్ వైస్ రీసెర్చ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే లైవ్‌మింట్ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.
“రూపాయి పరంగా చూస్తే బంగారం ధర రూ.48,793 నుంచి 48,473 మధ్య మారనుంది. రెసిస్టన్స్ రూ. 49,284 నుంచి రూ. 49,455 మధ్య మారనుంది. వెండికి రూ.62,324 నుంచి- 61,659 మద్దతు ఉండగా, రెసిస్టన్స్ రూ. 63,357 నుంచి 63,725 మధ్య కొనసాగనుంది. అందుకే, వ్యాపారులు కఠినమైన స్టాప్-లాస్‌తో వర్తకం చేయాలని సూచిస్తున్నాం." అని ప్రశాంత్ తాప్సే తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. అయితే, వారి మధ్య చర్చలు విఫలమవ్వడంతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆసన్నమైందని అమెరికా హెచ్చరించింది. ఇదిలావుండగా, యుద్ధాన్ని నిలువరించేందుకు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ అటు ఉక్రెయిన్, ఇటు రష్యాతో చర్చలు జరుపుతున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.