Home /News /business /

GOLD PRICES TODAY ROSE AGAIN BUT SILVER PRICES STABLE AND IF YOU WANT TO KNOW EXACT PRICES IN TELUGU STATES CLICK HERE PRV

Gold Price Today: మహిళలకు షాకింగ్​ న్యూస్​.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం బంగారం ఎంతంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పండుగ సీజన్ కావడంతో బంగారం (Gold) కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది

ఇంకా చదవండి ...
పండుగ సీజన్​ కావడంతో బంగారం (Gold) కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది. ఇక తాజాగా శనివారం (అక్టోబర్‌ 09)న 10 గ్రాముల బంగారం ధరపై (gold price) దాదాపు రూ.100 వరకు పెరిగింది. అయితే వెండి (silver) ధరల్లో మార్పు లేదు. ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌ (Hyderabad)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది. విజయవాడ (Vijayawada)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,890 ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (gold) ధర రూ.46,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,240 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,130 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,140 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,940 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold price) రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000 ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది.

వెండి ధరలు (silver prices today) చూస్తే..

ఢిల్లీలో కిలో వెండి (silver) రూ.61,200 ఉండగా, చెన్నై (Chennai)లో రూ.65,200 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.61,200 ఉండగా, కోల్‌కతాలో రూ.61,200 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,200 ఉండగా, కేరళలో రూ.61,200 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,200 ఉంది. విజయవాడలో రూ. 65,200 వద్ద కిలో వెండి ధర కొనసాగుతోంది.

బంగారం ధర (gold rates)ల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Gold price, Gold Prices Today, Silver price

తదుపరి వార్తలు