బంగారం ధరలు వరుసగా రెండో రోజు దిగివచ్చాయి. బంగారం ధర మంగళవారం భారీగా తగ్గింది. పది గ్రాముల మేలిమి బంగారం దాదాపు 400 రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ లో బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 420 రూపాయల తగ్గుదలతో 43,300 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 400 రూపాయల తగ్గుదలతో 41,020 రూపాయలకు చేరుకుంది. ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు నిన్నటి ధర కంటే 320 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,520 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 210 రూపాయల తగ్గుదలతో 43,175 రూపాయలు నమోదు చేసింది. వెండి ధర కేజీకి ఎటువంటి మార్పులకు లోను కాలేదు. దీంతో 40 వేల మార్కు కంటే దిగువనేకేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 39,500 రూపాయల వద్దనిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold price down, Gold rates