Gold Rate: తగ్గుముఖం పట్టిన బంగారం ధర...తులం ధర ఎంతంటే...

దేశీయంగా చూస్తే హైదరాబాద్ లో 24 కేరట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.44930 పలకగా, ముంబైలో 44982 గా పలికింది.

news18-telugu
Updated: March 27, 2020, 5:32 PM IST
Gold Rate: తగ్గుముఖం పట్టిన బంగారం ధర...తులం ధర ఎంతంటే...
Gold Price Today: తగ్గిన బంగారం ధర... తులం ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం ధరలు ఈ రోజు తగ్గుముఖం పట్టాయి. యుఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడటంతో పాటు. మునుపటి సెషన్‌లో ఎంసిఎక్స్‌లో ఏప్రిల్ బంగారు ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.8% తగ్గి రూ. 43,195 చేరుకుంది. జూన్ బంగారు ఫ్యూచర్స్ నేడు 0.5% తగ్గి రూ. 43,420కు చేరుకుంది. వెండి ధరలు MCX ఫ్యూచర్‌లతో 0.08% తగ్గి కిలోకు, రూ. 41,290 కు చేరుకున్నాయి. గత నాలుగు రోజులలో, బంగారు ఏప్రిల్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు,రూ. 3,700 పెరిగాయి.

మరోవైపు భారతదేశంలో కమోడిటీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో వ్యాపార గంటలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 14 వరకు తగ్గించనున్నట్లు ఎక్స్ఛేంజీలు తెలిపాయి. దీంతో ట్రేడింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మార్చి 30 నుండి ఏప్రిల్ 14 వరకు కొత్త సమయం అమలులోకి వస్తుంది.

గ్లోబల్ మార్కెట్లలో, మునుపటి సెషన్లో లాభాల రేటుపై బంగారం ధరలు రెండు వారాల గరిష్టాన్ని తాకింది. స్పాట్ బంగారం ఔన్సుకు 1,621.07 డాలర్లకు చేరుకుంది. అటు దేశీయంగా చూస్తే హైదరాబాద్ లో 24 కేరట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.44930 పలకగా, ముంబైలో 44982 గా పలికింది.
First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading