Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర...వరుసగా నాలుగో రోజు పసిడి పతనం...

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల (24 కేరట్ల) బంగారం ధర రూ.38,819 పలకగా, విజయవాడలో 38,822 పలికింది, అలాగే ముంబై మార్కెట్లో రూ.38,721కు బంగారం పతనమైంది.

Krishna Adithya | news18-telugu
Updated: September 20, 2019, 2:55 PM IST
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర...వరుసగా నాలుగో రోజు పసిడి పతనం...
Gold Rate: తగ్గిన బంగారం ధర...(ప్రతీకాత్మక చిత్రం)
Krishna Adithya | news18-telugu
Updated: September 20, 2019, 2:55 PM IST
 

బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు కూడా భారతీయ మార్కెట్లలో తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో అక్టోబర్ బంగారం ఫ్యూచర్లు 0.04 శాతం తగ్గి రూ.37,670వద్ద ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం, బంగారంపై ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు మదుపుదారులు ఆసక్తి తగ్గించుకున్నారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని సెంట్రల్ బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిడి దృష్ట్యా అమెరికా ఫెడ్ రిజర్వ్ సైతం 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అలాగే దేశీయంగా జీఎస్టీ కౌన్సిల్ భేటీలో భాగంగా బంగారం, ఇతర విలువైన రాళ్లకు సైతం ఈ-వే బిల్లు సిస్టమ్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దేశీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల (24 కేరట్ల) బంగారం ధర రూ.38,819 పలకగా, విజయవాడలో 38,822 పలికింది, అలాగే ముంబై మార్కెట్లో రూ.38,721కు బంగారం పతనమైంది.

ధరలు పతనం కావడంతో బంగారం కొనుగోలు చేసేందుకు, పసిడి ప్రేమికులు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ సైతం కలిసి రావడంతో జ్యువెలరీ షాపులు ఆఫర్లతో మార్కెట్లను ముంచెత్తేందుకు సిద్ధం అవుతున్నాయి.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...