Gold Rate Today: పసిడి పరుగులు... భారీగా పెరిగిన బంగారం ధరలు

ఒకే రోజు బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ఏకంగా రూ.2,400 పెరుగుదలతో రూ.39,400కు చేరింది.

news18-telugu
Updated: August 17, 2019, 8:11 AM IST
Gold Rate Today: పసిడి పరుగులు... భారీగా పెరిగిన బంగారం ధరలు
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మరోసారి పసిడి పరుగులు తీస్తోంది. ఒకే రోజు  బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ఏకంగా రూ.2,400 పెరుగుదలతో రూ.39,400కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నప్పటికీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడంతో ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.360 పెరుగుదలతో రూ.36,120కు చేరింది.

బంగారం ధర భారీగా పెరిగితే.. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. కేజీ వెండి ధర నిలకడగా రూ.47,850 వద్ద కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌లో పురోగతి లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. ముఖ్యంగా యూఎస్ బాండ్లపై నెగిటివ్ యీల్డింగ్స్ కారణంగా బంగారంపై పెట్టుబడులు పెరిగినట్లు బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో బంగారం ధరలు ఈ ఏడాది దాదాపు 17 శాతం పెరిగాయి. అలాగే ఫెడ్ వడ్డీ రేట్లపై మదుపరులు కన్నేసి ఉంచారు.

First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు