Gold Rate: బంగారం ధరలు మరోసారి భగ్గు..భగ్గు..తులం పసిడి కొనాలంటే మంటలే...

Gold Price (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate: ప్రపంచ మార్కెట్లలో పసిడి ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో శనివారం ముగింపుతో పోలిస్తే బంగారం 18 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,603 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

  • Share this:
    Gold Rate: బంగారం ధరలు మరోసారి పుంజుకున్నాయి. నాలుగు రోజుల తర్వాత సోమవారం మళ్లీ ధరలు పెరిగాయి. 10 గ్రాముల పసిడి రూ.593 పెరిగి రూ.41,829 వద్ద ట్రేడ్‌ అయింది. బంగారం ధరలు ఫ్యూచర్‌ మార్కెట్లో 1.42 శాతం పెరిగాయి. అటు ప్రపంచ మార్కెట్లలో పసిడి ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో శనివారం ముగింపుతో పోలిస్తే బంగారం 18 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,603 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కోవిడ్‌-19 ఆందోళన, ఆర్థిక మందగమనంపై యూఎస్ ఫెడ్ బ్యాంక్ చైర్ జెరోమ్ పావెల్ వివరణ ఇస్తూ, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా వుందని, అవసరమైతే అన్ని చర్యల్ని తీసుకోవడానికి తాము (ఫెడ్‌) సిద్ధంగా ఉందంటూ వడ్డీరేట్ల కోత సంకేతాలందించారు. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ రేట్లు భారీగా తగ్గించనుందని ఆర్థికవేత్తలు ఆదివారం అంచనా వేశారు. అలాగే 12 నెలల్లో బంగారం ధర ఔన్స్‌కు 1,800 డాలర్లకు చేరుతుందని పేర్కొంది.
    Published by:Krishna Adithya
    First published: