• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOLD PRICES SOARED MORE THAN 2 PERCENT ON MONDAY SHRUGGING OFF EARLY LOSSES MK

కరోనాతో బంగారం భారీగా పెరిగే చాన్స్...తులం లక్ష దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు...

కరోనాతో బంగారం భారీగా పెరిగే చాన్స్...తులం లక్ష దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు...

Gold Price Today (ప్రతీకాత్మక చిత్రం)

బంగారానికి డిమాండ్‌ పెరగడంతో సోమవారం ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి రూ 517 ఎగిసి రూ 40,875 పలికింది.

  • Share this:
    కరోనా వైరస్‌ వ్యాప్తిపై నెలకొన్న భయాందోళనలతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం బంగారానికి రెక్కలు వచ్చేందుకు దోహదపడుతున్నాయి. ముఖ్యంగా మహమ్మారి వైరస్‌ షేర్‌ మార్కెట్‌ను షేక్‌ చేస్తుండటంతో మదుపరులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. బంగారం వైపు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో బంగారం కాస్ల్టీగా మారింది. పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. బంగారానికి డిమాండ్‌ పెరగడంతో సోమవారం ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి రూ 517 ఎగిసి రూ 40,875 పలికింది. ఇక కిలో వెండి ఏకంగా రూ 1259 పెరిగి రూ 37,102కు చేరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్న ఆందోళనతో బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత ఎగబాకుతాయని బులియన్‌ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. దేశీయ మార్కెట్లో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే బంగారం తులం లక్ష దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని బులియన్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తితో అటు గ్లోబల్ మార్కెట్స్ కు కోలుకోలేని దెబ్బ తగులుతోంది.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు