news18-telugu
Updated: July 11, 2019, 5:44 PM IST
బంగారానికి అంతర్జాతీయంగా బలహీనమైన ట్రేడ్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే బ్యాడ్ న్యూస్. గురువారం బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై రూ.930 పెరగడం మార్కెట్ వర్గాలకు షాకిచ్చింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ సమాచారం ప్రకారం ప్రస్తుతం న్యూ ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.930 పెరిగి రూ.35,800 దగ్గర నిలిచింది. 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.35,630. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.100 పెరిగి రూ.27,400 దగ్గర నిలిచింది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.36,290 కాగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.33,270. అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ బంగారం ధర 1,420.80 డాలర్లు.
Read this:
బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరిత్వరలో వడ్డీ రేట్లలో కోత ఉంటుందని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పోవెల్ సూచనప్రాయంగా చెప్పడం, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించారని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇక వెండి ధర చూస్తే కేజీపై రూ.300 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.39,200. మార్కెట్లో 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.81,000 కాగా, అమ్మకం ధర రూ.82,000. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 15.24 డాలర్లు.
Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్మీ 7ఏ... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Railways: రైళ్లల్లో రోజుకు మరో 4 లక్షల సీట్లు... సరికొత్త టెక్నాలజీUPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే లావాదేవీల్లో ఈ జాగ్రత్తలు పాటించండి
Good News: ఆధార్ కాంటెస్ట్ గడువు పొడిగింపు... రూ.30,000 గెలుచుకోండి ఇలా
Published by:
Santhosh Kumar S
First published:
July 11, 2019, 5:44 PM IST