news18-telugu
Updated: April 24, 2020, 2:20 PM IST
ప్రతీకాత్మక చిత్రం
అక్షయ తృతీయకు ముందు బంగారం ధరలు పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్ పెరగడం వరుసగా ఇది మూడో రోజు. ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 0.67% అంటే రూ.313 పెరిగి రూ.46,740 ధరకు చేరుకుంది. మళ్లీ రూ.47,000 మార్క్ వైపు ధర పరుగులు తీస్తోంది. గత వారం 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 మార్క్ దాటిన సంగతి తెలిసిందే. ఇప్పుడూ అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇక హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.41,670 కాగా 24 క్యారట్ బంగారం ధర రూ.45,310. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,724 డాలర్లు. ఇక వెండి రేట్లు చూస్తే ఎంసీఎక్స్‌లో మే సిల్వర్ ఫ్యూచర్ కేజీపై 0.63 శాతం అంటే రూ.265 పెరిగి రూ.42,071 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.42430. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 15.21 డాలర్లు.
భారతదేశంలో ఏప్రిల్ 26న అక్షయ తృతీయ పర్వదినం ఉంది. అక్షయ తృతీయకు బంగారం కొంటే మంచిదన్న సెంటిమెంట్ ఎప్పట్నుంచో ఉంది. సాధారణంగా అయితే ఈ రోజుల్లో నగల దుకాణాలు కిటకిటలాడతాయి. కానీ లాక్డౌన్ కారణంగా నగల షాపులు కూడా మూతపడ్డాయి. ఈసారి నగల దుకాణాల్లో అక్షయ తృతీయ సందడి కనిపించదు. అయితే కొన్ని నగల దుకాణాలు మాత్రం ఆన్లైన్లో నగల్ని అమ్ముతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Akshay Tritiya 2020: అక్షయ తృతీయ ఆఫర్స్... ఆన్లైన్లో బంగారు నగల అమ్మకాలు
Online Gold: ఆన్లైన్లో బంగారు నగలు కొనొచ్చా? తెలుసుకోండి
SBI account: ఎస్బీఐలో ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎక్కువ లాభాలు
Published by:
Santhosh Kumar S
First published:
April 24, 2020, 2:20 PM IST