• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOLD PRICES RISE TODAY AFTER FALLING 1800 PER 10 GRAM IN A SINGLE DAY MK

Gold Rate: కరోనాతో పసిడి పరుగులు...తులం బంగారంపై రూ.1800 పెరుగుదల

Gold Rate: కరోనాతో పసిడి పరుగులు...తులం బంగారంపై రూ.1800 పెరుగుదల

బంగారం

హైదరాబాద్, చెన్నై, విజయవాడ, వైజాగ్ లలో బంగారం ధరలు రూ.42 వేలకు పైగా పలికాయి. తులం బంగారంపై రూ.1800 పెరుగుదల నమోదైంది.

  • Share this:
    కరోనా ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న క్రమంలో బంగారం ధరలు పరుగులుపెడుతున్నాయి. అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను తగ్గించడంతో పసిడి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగాయి. ఫెడ్‌ వడ్డీరేట్లలో కోత విధించడంతో పసిడి ధరలు మరోసారి భారీ పెరుగుదలకు దారితీశాయి. అంటు అంతర్జాతీయగా బంగారం ధరలు మరోసారి 1520 పలికాయి. అలాగే దేశీయంగా పదిగ్రాముల బంగారం ధర ముంబైలో 42 వేలకు పైగా నమోదు అయ్యింది. అలాగే హైదరాబాద్, చెన్నై, విజయవాడ, వైజాగ్ లలో బంగారం ధరలు రూ.42 వేలకు పైగా పలికాయి. తులం బంగారంపై రూ.1800 పెరుగుదల నమోదైంది. అటు ఎంసీఎక్స్‌లో సోమవారం ఉదయం పది గ్రాముల బంగారం ఏకంగా రూ. 700 భారమై రూ 41,068కి పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం కూడా బంగారం మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ వెండి ధరలు సైతం బంగారం బాటలోనే భారమయ్యాయి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ 338 పెరిగి రూ 40,825కు ఎగబాకింది. కరోనా ప్రభావంతో రానున్న రోజుల్లోనూ బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు