Gold price today: భారీగా తగ్గిన బంగారం ధర...రూ.300 పతనమైన తులం పసిడి...

Gold price today: వరుసగా రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో బంగారం ధర (24 కేరట్లు) 10 గ్రాములు రూ.39,225గా నమోదైంది.

news18-telugu
Updated: September 9, 2019, 6:45 PM IST
Gold price today:  భారీగా తగ్గిన బంగారం ధర...రూ.300 పతనమైన తులం పసిడి...
తగ్గిన బంగారం ధరలు
news18-telugu
Updated: September 9, 2019, 6:45 PM IST
Gold price today: బంగారం ధరలు సడెన్ గా తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వరుసగా రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో బంగారం ధర (24 కేరట్లు) 10 గ్రాములు రూ.39,225గా నమోదైంది. అదే సమయంలో ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ గత వారం కన్నా 0.07 శాతం తగ్గి రూ.38527 వద్ద ట్రేడవుతోంది. గత వారం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.39885 పలికాయి. గ్లోబల్ గా చూసినట్లయితే ఔన్సు బంగారం ధర న్యూయార్క్ మార్కెట్లో 1509 డాలర్లకు పతనమైంది.

అదే సమయంలో దేశీయంగా రిటైల్ మార్కెట్లో బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.39730గా పలకగా, ముంబై బులియన్ మార్కెట్లో రూ.39720గా పలికింది. అలాగే ఏపీలోని విజయవాడ, వైజాగ్ మార్కెట్లలో రూ.39760 గా బంగారం ధర పలుకుతోంది.

ఇదిలా ఉంటే మరో విలువైన లోహం వెండి సైతం భారీగా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ.1400 పతనమై రూ.48500గా పలికింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే సూచనలు రావడంతో గోల్డ్ ట్రేడర్స్ వేచిచూసే ధోరణిలో ఉన్నారు. అలాగే దేశీయంగా కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున ఆఫర్లు, డిస్కౌంట్స్ ప్రకటిస్తున్న నేపథ్యంలో స్వల్ప తగ్గుదల నమోదైనట్లు బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

First published: September 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...