Gold Rate: పెరిగిన బంగారం ధర...పసిడి ప్రేమికులకు షాక్..

ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.39,299 పలికింది. అటు వెండి ధరలో కూడా అదే తీరు కనిపించింది. ఈ రోజు కిలో వెండి ధరలో 676 రూపాయల పెరుగుదల నమోదు అయింది. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.46,672 పలికింది.

news18-telugu
Updated: December 4, 2019, 6:04 PM IST
Gold Rate: పెరిగిన బంగారం ధర...పసిడి ప్రేమికులకు షాక్..
Gold rate: (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం 332 రూపాయలు పెరిగి రూ.39వేల మార్క్ ను దాటింది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.39,299 పలికింది. అటు వెండి ధరలో కూడా అదే తీరు కనిపించింది. ఈ రోజు కిలో వెండి ధరలో 676 రూపాయల పెరుగుదల నమోదు అయింది. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.46,672 పలికింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర 1,483 డాలర్లు పలుకగా, ఔన్సు వెండి ధర 17.27 డాలర్లుగా ట్రేడయింది. అంతర్జాతీయంగా నెలకొన్న ట్రేడ్ వార్ పరిస్థితులు, ఆర్థిక మందగమనం దృష్ట్యా మదుపు దారులు బంగారంపై పెట్టుబడులు పెట్టాలని భావించడం, డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం వంటి కారణాల నేపథ్యంలో దేశీయంగా పసిడి, వెండి ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...