Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర...తులం రూ.30 వేలు దిశగా పతనం...

అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ తగ్గుతోంది. ఇరు దేశాలు ఒప్పందానికి వచ్చేట్లుగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటలోకి రావడంతో, బంగారం డిమాండ్ తగ్గేలా కనిపిస్తోంది.

news18-telugu
Updated: November 19, 2019, 9:46 PM IST
Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర...తులం రూ.30 వేలు దిశగా పతనం...
Gold rate: (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం ధరలు తగ్గడం పసిడి ప్రేమికులకు ఊరటనిస్తోంది. సరిగ్గా మూడు నెలల క్రితం రూ.40వేలకు చేరిన 10గ్రాముల బంగారం ధర, గత 3 నెలల్లో ఏకంగా రూ.2 వేలు పడిపోయింది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ ఆరంభంలో బంగారం రూ.50 వేలు పైకి చేరుతుందని అంతా అంచనా వేశారు. అయితే బంగారం ధర ప్రస్తుతం భారీగా పడిపోయింది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ తగ్గుతోంది. ఇరు దేశాలు ఒప్పందానికి వచ్చేట్లుగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటలోకి రావడంతో, బంగారం డిమాండ్ తగ్గేలా కనిపిస్తోంది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వు ఇకపై రేట్ల కోత ఉండదని సంకేతాలిచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గుచూపడం తగ్గించేశారు. అలాగే బంగారు ఆభరణాలు కొనుగోలు డిమాండ్ తగ్గడంతో, పసిడి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇదే కొనసాగితే బంగారం తులం ధర భారీగా పడిపోయినా ఆశ్చర్యం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

First published: November 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...