GOLD PRICES IN INDIA TODAY HIGH PRICES ARE LIKELY TO HIT THE PHYSICAL DEMAND OF GOLD IN INDIA MK
Gold Rate: భగ్గుమంటున్న బంగారం ధరలు...తులం పసిడి కొనాలంటే చుక్కలే...
(ప్రతీకాత్మక చిత్రం)
బంగారం భారీగా పెరగడం వెనుక కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నింపుతోంది. చైనా దాటి కరోనా కేసులు, సౌత్ కొరియా, జపాన్‌లో నమోదైన నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పతనం అవుతున్నాయి.
కరోనా వైరస్ దెబ్బకు బంగారం ధరలు మండిపోతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.900 పెరిగి రూ.44,472కు చేరుకుంది. ఇప్పటి వరకూ బంగారం పెరిగిన రేటులో ఇదే అత్యంత గరిష్ట స్థాయిలో ఉంది. ఇదిలా ఉంటే బంగారం భారీగా పెరగడం వెనుక కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నింపుతోంది. చైనా దాటి కరోనా కేసులు, సౌత్ కొరియా, జపాన్‌లో నమోదైన నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పతనం అవుతున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం, వెండి వైపు మరలిస్తున్నారు. ఫలితంగా, అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో ధరలు పుంజుకుంటున్నాయి. అలాగే రూపాయి క్షీణత కూడా బంగారం పెరుగుతున్న మరో కారణం. ఇదిలా ఉంటే న్యూయార్క్ మార్కెట్లో మార్కెట్లో ఔన్స్ బంగారం 1,682 డాలర్లు తాకింది. అటు హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ఏకంగా రూ.43,590గా నమోదైంది.