హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Prices: పండుగ వేళ మహిళలకు గుడ్​న్యూస్.. రెండు నెలల్లో తొలిసారి దిగొచ్చిన బంగారం ధరలు..

Gold Prices: పండుగ వేళ మహిళలకు గుడ్​న్యూస్.. రెండు నెలల్లో తొలిసారి దిగొచ్చిన బంగారం ధరలు..

బంగారం ధరలు ఔన్స్‌కు 1800 డాలర్ల సమీపంలోకి పడిపోవడంతో గోల్డ్ మార్కెట్ డేంజర్ జోన్‌లో ఉందని నిపుణులు అంటున్నారు. అమెరికా డాలర్ 20 ఏళ్ల గరిష్ట స్థాయి 104.8కు చేరడం ఇందుకు కారణమని చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

బంగారం ధరలు ఔన్స్‌కు 1800 డాలర్ల సమీపంలోకి పడిపోవడంతో గోల్డ్ మార్కెట్ డేంజర్ జోన్‌లో ఉందని నిపుణులు అంటున్నారు. అమెరికా డాలర్ 20 ఏళ్ల గరిష్ట స్థాయి 104.8కు చేరడం ఇందుకు కారణమని చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

Gold Prices: గత రెండు నెలల కాలంగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత వారం రూ. 800 వరకు పెరిగిన పసిడి ధరలు ఈ వారం తగ్గుదలతో ప్రారంభమయ్యాయి. నేటి  ( అక్టోబర్​ 11) ప్రారంభ సెషన్​లో MCX గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.2% తగ్గి రూ. 46,937 కు చేరింది.

ఇంకా చదవండి ...

పండుగ సీజన్​లో బంగారం కొనాలనుకునే వారికి గుడ్​న్యూస్​. గత రెండు నెలల కాలంగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత వారం రూ. 800 వరకు పెరిగిన పసిడి ధరలు ఈ వారం తగ్గుదలతో ప్రారంభమయ్యాయి. నేటి ( అక్టోబర్​ 11) ప్రారంభ సెషన్​లో MCX గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.2% తగ్గి రూ. 46,937 కు చేరింది. వెండి ఫ్యూచర్స్ కిలో రూ. 61,737 ధరకి చేరుకుంది. భారతదేశంలో దసరా, దీపావళి, ధంతేరస్ పండగ సీజన్లలో బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటాయి. ఎందుకంటే ఈ పండుగ సీజన్ల​లో చాలా మంది బంగారం కొనుగోళ్లను సెంటిమెంట్​గా భావిస్తారు. ఓవైపు పండగ సీజన్​ మరోవైపు బంగారం ధరల తగ్గుదలతో వీటి కొనుగోళ్లు మరింత పెరగనున్నాయి.

Huzurabad By Election: ఆ రిపోర్టు ప్రకారం హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదా.. !అసలేం జరుగుతోంది..


దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,250 ఉంది. చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,420 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,940 ఉంది.

YS Sharmila: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వైఎస్ షర్మిలకు చుక్కెదురు.. కారణం ఏంటంటే..


తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్​లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,890 ఉంది. భారతదేశంలో బంగారంపై 10.75% దిగుమతి సుంకం, 3% జీఎస్​టీ వర్తిస్తుంది.

Farmers: దిక్కుతోచని స్థితిలో రైతన్న.. అమాంతం పడిపోయిన ధరలు..


హెచ్చుతగ్గులకు ప్రధాన కారణం?

పసిడి ధరలు హెచ్చుతగ్గులకు గురికావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతక్తలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

First published:

Tags: Dhanteras gold, Gold, Gold price down

ఉత్తమ కథలు