హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Silver Prices: పడిపోయిన పసిడి.. 6 నెలల కనిష్టానికి పతనమైన బంగారం ధర!

Gold Silver Prices: పడిపోయిన పసిడి.. 6 నెలల కనిష్టానికి పతనమైన బంగారం ధర!

 బంగారం ధర ఇలా పడిపోతోందేంటి? 6 నెలల కనిష్టానికి పతనమైన రేటు!

బంగారం ధర ఇలా పడిపోతోందేంటి? 6 నెలల కనిష్టానికి పతనమైన రేటు!

Gold Rate In Hyderabad | బంగారం ధర పడిపోయింది. పసిడి రేటు మళ్లీ దిగి వచ్చింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    Gold Rate Today | బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. దేశంలో పసిడి రేటు (Gold Price) మరోసారి దిగివచ్చింది. గత వారం పతనాన్ని ఈ వారం కూడా కొనసాగిస్తోంది. ఈరోజు కూడా బంగారం ధర (Gold Rate) పడిపోయింది. 0.3 శాతం మేర క్షీణించింది. ఎంసీఎక్స్ (MCX Gold) మార్కెట్‌లో సోమవారం గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. పది గ్రాములకు రూ. 49,237 స్థాయికి దిగి వచ్చింది. అమెరికా డాలర్ బలపడటం, అమెరికా బాండ్ ఈల్డ్ పైకి చేరడం వంటి అంశాలు బంగారంపై ప్రతికూల ప్రభావం చూపాయని నిపుణులు పేర్కొంటున్నారు.

    దేశీ మార్కెట్‌లో బంగారం ధర వారంలో చూస్తే 3 శాతం మేర పతనమైంది. దాదాపు రూ. 1500 దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే బంగారం ధర ఈ రోజు 0.4 శాతం మేర పడిపోయింది. ఔన్స్‌కు పసిడి రేటు 1668 డాలర్ల వద్ద కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గడం వల్ల ఆ ఎఫెక్ట్ దేశీ మార్కెట్‌పై కూడా పడింది.

    బైక్ , స్కూటర్ కొనేందుకు చౌక వడ్డీకే రుణాలు ఇస్తున్న 20 బ్యాంకులు ఇవే!

    ఇప్పుడు అందరి ఫోకస్ కేవలం అమెరికా ఫెడరల్ రిజర్వు పాలసీ సమీక్ష పైనే ఉంది. ఈ వారంలోనే పాలసీ సమావేశం జరగనుంది. చాలా మంది అనలిస్ట్‌లు ఈసారి అమెరికా ఫెడరల్ రిజర్వు ఫెడ్ రేటును 75 బేసిస్ పాయింట్ల మేర పెంచొచ్చని అంచనా వేస్తున్నారు. కొంత మంది అయితే ఈ సారి ఫెడ్ రేటు పెంపు ఏకంగా 100 బేసిస్ పాయింట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

    కేంద్రం అద్భుతమైన అవకాశం.. ఉచితంగానే రూ.75 వేలు పొందండిలా

    అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేటును పెంచడానికి తగిన కారణాలు ఉన్నాయని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంటోంది. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడంతో పాటు మరింత పైకి చేరడంతో ఫెడ్ రేటు పెంపు అనివార్యంగా మారిందని తెలిపింది. ఫెడ్ తీసుకునే నిర్ణయం అమెరికా డాలర్‌కు బలోపేతం అవుతుందని పేర్కొంది. డాలర్ ఇండెక్స్ పుంజుకుంటే అప్పుడు పసిడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించింది.

    అలాగే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాడ్ కూడా ఈసారి మీటింగ్‌లో వడ్డీ రేటును 50 నుంచి 75 బేసిస్ పాయింట్ల మేర పెంచొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధర తగ్గుదలతో పాటు, మరోవైపు గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్లు కూడా తగ్గాయి. బంగారం ధర ఇప్పటికే తగ్గిందని, తాజా పరిస్థితులను గమనిస్తే.. బేరిష్ ట్రెండ్ మరింత కాలం కొనసాగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అంటే పసిడి రేటు మరింత తగ్గొచ్చనే అభిప్రాయని రావొచ్చు.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Gold, Gold price in hyderabad, Gold Price Today, Gold rate hyderabad, Gold Rate Today

    ఉత్తమ కథలు