Gold Prices: మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు... బులియన్ మార్కెట్‌లో జోరు

Gold Prices: మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు... బులియన్ మార్కెట్‌లో జోరు (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate Today: ఏప్రిల్ నుంచి బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. అప్పటి నుంచి కంటిన్యూగా పెరుగుతూనే ఉన్నాయి. నేటి ధరలు ఎలా ఉన్నాయో, భవిష్యత్తేంటో తెలుసుకుందాం.

  • Share this:
    Gold Prices Today: స్టాక్ మార్కెట్లు ఆల్‌టైమ్ హై రికార్డులకు చేరడంతో... బంగారంపైనా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రధానంగా విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FII) బాగా పెరుగుతున్నాయి. నిఫ్టీ 50లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంటే... ఇన్వెస్టర్లు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం ధరలు ఆల్రెడీ చాలా ఎక్కువే ఉన్నా... ఇంకా పెరుగుతాయనే అంచనా ఉంది. అందువల్ల ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మేలిమి బంగారం ధరలు 10 గ్రాములు రూ.60 వేలకు చేరగలదనే అంచనా ఉంది. అందువల్లే బంగారానికి పెట్టుబడులు పెరిగి.. ధరలు పెరుగుతున్నాయి.

    రూ.50వేలు దాటి ముందుకు:
    బంగారం ధరలు... అంతర్జాతీయంగా కూడా పెరుగుతున్నాయి. రూపాయితో పోల్చితే డాలర్ బలపడుతోంది. కాబట్టి... మనం బంగారం దిగుమతులకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి. మార్చి 31న 22 క్యారెట్ల నగల తయారీకి వాడే బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడు (శుక్రవారం నాటికి)... రూ.46,100 ఉంది. 72 రోజుల్లో ధర రూ.5,000 పెరిగింది. అలాగే.. 24 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా... ఇప్పుడు రూ.50,300 ఉంది. అంటే 72 రోజుల్లో ధర రూ.5,460 పెరిగింది. నేటి ఉదయం రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

    Gold Price 12-6-2021:
    గత 10 రోజుల్లో బంగారం ధర 5 సార్లు పెరగగా... 3 సార్లు తగ్గింది. 2 సార్లు స్థిరంగా ఉంది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,610 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.36,880 ఉంది. నిన్న తులం ధర రూ.240 పెరిగింది. ఇక 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.46,100 ఉంది. నిన్న ధర రూ.300 పెరిగింది.

    పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.5,030 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.40,240 ఉంది. నిన్న తులం ధర రూ.264 పెరిగింది. ఇక 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.50,300 ఉంది. నిన్న ధర రూ.330 పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి.

    Silver Price 12-6-2021:
    వెండి ధరలు గత 10 రోజుల్లో 4 సార్లు పెరగగా... 4 సార్లు తగ్గాయి. 2 సార్లు స్థిరంగా ఉన్నాయి. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.77.30 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.618.40 ఉంది. నిన్న ధర రూ.9.60 పెరిగింది. అదే 10 గ్రాములు కావాలంటే... ధర రూ.773 ఉంది. నిన్న ధర రూ.12 పెరిగింది. 100 గ్రాములు ధర రూ.7,730 ఉండగా... కేజీ వెండి ధర... రూ.77,300 ఉంది. గత 6 నెలల్లో వెండి ధర రూ.1,300 పెరిగింది.

    ఇది కూడా చదవండి: Horoscope Today: నేటి రాశి ఫలాలు... డబ్బు జాగ్రత్త... వీరు పెళ్లి ప్రస్తావన తెస్తారు

    బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా?
    గోల్డ్ రేట్స్ ఇంకా పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇండియాలో కరోనా తగ్గుతోంది కాబట్టి ఆర్థిక వ్యవహారాలు పుంజుకుంటాయి. అందువల్ల ప్రజల చేతిలో కాస్తంత డబ్బు వచ్చే అవకాశం ఉంది. దాంతో వారు కొత్తగా నగలు కొంటారు. లేదా... కరోనా టైంలో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకుంటారు. అందువల్ల బంగారం ధరలు మరింత పెరుగుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: