Gold Rate: స్థిరంగానే బంగారం ధరలు..కొండెక్కుతున్న వెండి...

Gold Rate: ఢిల్లీలో 10 గ్రాములు బంగారం (24 కేరట్లు) ధర రూ.39670 వద్ద నమోదు అయినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. అదే సమయంలో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం (24 కేరట్లు) ధర రూ.39800గా నమోదైంది.

news18-telugu
Updated: August 27, 2019, 7:12 PM IST
Gold Rate: స్థిరంగానే బంగారం ధరలు..కొండెక్కుతున్న వెండి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 27, 2019, 7:12 PM IST
Gold Rate: బంగారం ధరలు వరుసగా 5 రోజుల పాటు రికార్డు స్థాయిలో పెరిగిన అనంతరం, ఈ రోజు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 10 గ్రాములు బంగారం (24 కేరట్లు) ధర రూ.39670 వద్ద నమోదు అయినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. అదే సమయంలో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం (24 కేరట్లు) ధర రూ.39800గా నమోదైంది. అటు విజయవాడలో రూ.39795గా నమోదు అయ్యింది. అటు అంతర్జాతీయంగా చూసినట్లయితే ఔన్సు బంగారం ధర 1530 డాలర్లు పలికింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారిగా బంగారం ధర 6 సంవత్సరాల గరిష్టాన్ని తాకింది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక మాంద్యం, కారణంగా మదుపరులు బంగారం వైపు తమ పెట్టుబడులు పెడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. రానున్న మూడునెలల్లో బంగారం ధర ఒక ఔన్సు పరిమాణానికి 1600 డాలర్లు దాటడం ఖాయమని యూబీఎస్ గ్రూప్ ఏజీ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బంగారం ధరలు ఇకపై మరింత పెరిగే అవకాశం ఉందనే వార్తలతో పసిడి ప్రియుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ధరలు దిగివచ్చే అవకాశం లేదని తులం బంగారం ధర 50 వేలు అవుతుందనే వార్తలో, రికార్డు స్థాయిలో ధర ఉన్నా పెద్ద మొత్తంలో కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నగల వర్తకులు చెబుతున్నారు.

మరోవైపు బంగారంతో పాటు వెండి ధరలు సైతం కొండెక్కి కూర్చున్నాయి. వెండి ధర ఒకే రోజు 190 రూ.లు పెరిగి రూ.46740(ఒక కేజీ)గా నమోదైంది. రానున్నది పండుగల సీజన్ కానున్న నేపథ్యంలో వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

First published: August 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...