HOME »NEWS »BUSINESS »gold prices fell on tuesday in hyderabad and new delhi know latest gold and silver prices ss

Gold Price Today: దిగొస్తున్న బంగారం, వెండి ధరలు... ఇవాళ్టి రేట్స్ ఇవే

Gold Price Today: దిగొస్తున్న బంగారం, వెండి ధరలు... ఇవాళ్టి రేట్స్ ఇవే
Gold Price Today: (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate Today | హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం ధర రూ.41,060 కాగా, 22 క్యారట్ ధర రూ.37,640. న్యూ ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.

  • Share this:
    బంగారం, వెండి కొనాలనుకునేవారికి శుభవార్త. బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. గత వారం రోజులుగా ధరలు తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గితే, మంగళవారం మరో రూ.400 తగ్గింది. అంటే రెండు రోజుల్లో రూ.1,000 తగ్గింది. మంగళవారం హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం ధర రూ.41,060 కాగా, 22 క్యారట్ ధర రూ.37,640. న్యూ ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల బంగారం కేవలం రూ.61 తగ్గి రూ.40,422 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,544 డాలర్లు. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.48,900 ధరకు చేరుకుంది. న్యూ ఢిల్లీలో కేజీ వెండిపై ఏకంగా రూ.602 తగ్గింది. ప్రస్తుతం దేశ రాజధానిలో కేజీ వెండి ధర రూ.47,083. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 17.75 డాలర్లు. అంతర్జాతీయంగా డిమాండ్ లేకపోవడం వల్లే బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి





    ఇవి కూడా చదవండి:

    Gold: మార్కెట్ రేట్ కన్నా రూ.1,800 తక్కువ ధరకే బంగారం... కొనండి ఇలా

    Gold Loan: బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటున్నారా? వడ్డీ రేట్లు ఇవే

    Best Smartphones: రూ.10,000 బడ్జెట్ లోపు బెస్ట్ 5 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
    Published by:Santhosh Kumar S
    First published:January 14, 2020, 18:13 IST

    टॉप स्टोरीज