• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOLD PRICES FELL BELOW RS 50000 IN HYDERABAD KNOW LATEST GOLD AND SILVER RATES SS

Gold Price Today: గుడ్ న్యూస్... రూ.50,000 లోపు దిగొచ్చిన బంగారం ధర

Gold Price Today: గుడ్ న్యూస్... రూ.50,000 లోపు దిగొచ్చిన బంగారం ధర

Gold Price: గుడ్ న్యూస్... రూ.50,000 లోపు దిగొచ్చిన బంగారం ధర (ప్రతీకాత్మక చిత్రం)

Gold Price Today | బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్ రూ.50,000 లోపు దిగొచ్చింది. ఇవాళ హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలెలా ఉన్నాయో తెలుసుకోండి.

  • Share this:
    బంగారం ధర పెరిగిపోతోందని కంగారుపడ్డవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్ భారీగా తగ్గింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం ధర హైదరాబాద్‌లో రూ.50,000 కన్నా తక్కువకు దిగొచ్చింది. ఆగస్టులో ఓ దశలో 22 క్యారట్ గోల్డ్ రూ.55,000 ధరకు చేరువైంది. ఇప్పుడు రూ.50,000 కన్నా తక్కువకే లభిస్తోంది. గత 10 రోజులుగా బంగారం ధర తగ్గుతూనే ఉంది. ఇవాళ హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 22 క్యారట్ 10 గ్రాములపై రూ.510 తగ్గి రూ.49,240 ధరకు చేరుకుంది. ఇక 24 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.550 తగ్గి రూ.53,720 ధరకు చేరుకుంది. వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.800 పెరగడంతో రూ.66,300 ధరకు చేరుకుంది.

    Gold: ఇదే లాస్ట్ ఛాన్స్... మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం కొనండిలా

    Aadhaar Charges: ఆధార్ వివరాల అప్‌డేట్‌కు ఛార్జీలు ఎంతో తెలుసా?

    దేశీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గితే మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో గోల్డ్ రేట్ పెరిగింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 0.99 శాతం అంటే రూ.506 పెరిగి రూ.51,408 ధరకు చేరుకుంది. ఇక సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కిలోపై 1.46 శాతం అంటే రూ.952 పెరిగి రూ.66,142 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,956.10 డాలర్ల దగ్గర, ఔన్స్ వెండి ధర 27.52 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.

    Pension Scheme: ఈ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నవారికి సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్... ఆ తర్వాత పెనాల్టీ తప్పదు

    Honda Bike: హీరో స్ప్లెండర్‌కు పోటీగా తక్కువ ధరలో హోండా బైక్

    ఆగస్టులో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు గోల్డ్, సిల్వర్ రేట్స్ బాగా తగ్గాయి. మరోవైపు ఆగస్ట్ 31 నుంచి సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్మకాలు మొదలుకానున్నాయి. గోల్డ్ బాండ్స్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి అవకాశం.
    Published by:Santhosh Kumar S
    First published: