చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం బంగారం ధరలపైనా పడుతోందని మార్కెట్ వర్గాల్లో ఆందోళన కనిపిస్తోంది. కరోనా వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తుందన్న భయంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. దీంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధర 10 గ్రాములపై రూ.80 తగ్గింది. 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.42,330 కాగా, 22 క్యారట్ గోల్డ్ ధర రూ.38,800. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.131 తగ్గి రూ.41,453 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,577 డాలర్లు. మరోవైపు వెండి ధర పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.40 పెరిగి రూ.49,850 ధరకు చేరుకుంది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.89 పెరిగి రూ.47,465 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 17.86 డాలర్లు. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు బలపడింది. బంగారం ధరలు ఊగిసలాటలో ఉండటానికి కారణం కరోనా వైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆందోళనే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి
PPF Rules: పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
Debit Card: మీ ఫోన్ లాగా ఏటీఎం కార్డును స్విచ్చాఫ్ చేయొచ్చు ఇలాPublished by:Santhosh Kumar S
First published:January 31, 2020, 17:49 IST