Home /News /business /

GOLD PRICES ARE ROSE SLIGHTLY TODAY AND SILVER RATES ARE STABLE AND WANT TO KNOW PRICE DETAILS OVERALL INDIA CLICK HERE PRV

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగానే వెండి ధరలు.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది.

ఇంకా చదవండి ...
గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది. ఇక తాజాగా సోమవారం (డిసెంబర్​ 13)న 10 గ్రాముల బంగారం ధరపై (gold price) దాదాపు రూ.10 పెరిగింది. ఇక వెండి (silver) ధరల్లో (Silver price) మార్పు లేదు. ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌ (Hyderabad) లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర (Gold price) రూ.45, 110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210 వద్ద కొనసాగుతోంది.

చెన్నై నగరంలో నేడు 22 క్యారెట్ల బంగారం ధర (gold price) రూ. 45,390లు ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,510 లు ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,260లు ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,560లకు చేరుకుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబై (Mumbai) లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,780 లు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,780 లు ఉంది. కాగా, వెండి ధరల్లో (Silver price) మార్పు లేదు.

వెండి ధరలు పరిశీలిస్తే..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి (Silver price) ధర.61,200 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.61,200 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.65,100 ఉండగా, కోల్‌కతాలో రూ.61,200 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,200 ఉండగా, కేరళలో రూ.65,100 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,100 ఉండగా, విజయవాడలో రూ.65,100 వద్ద కొనసాగుతోంది

బంగారం ధర (gold rates)ల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి (for gold) వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Gold Prices Today, Silver price

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు