Home /News /business /

GOLD PRICES ARE ROSE SLIGHTLY AND SILVER RATES DOWN LITTLE BIT WANT TO KNOW PRICE DETAILS OVERALL INDIA CLICK HERE PRV

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు.. తులం బంగారం ఎంతంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది.

ఇంకా చదవండి ...
    గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది. ఇక తాజాగా శనివారం (డిసెంబర్​ 11)న 10 గ్రాముల బంగారం ధరపై (gold price) దాదాపు రూ. 10 పెరిగింది. ఇక వెండి (silver) ధరల్లో మార్పు వచ్చింది. వెండి ధరలు (Silver prices) దిగి వచ్చాయి. ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

    హైదరాబాద్‌ (Hyderabad)లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 వద్ద కొనసాగుతోంది.

    ఇతర ప్రాంతాల్లో బంగారం ధరలు..

    చెన్నై (Chennai) నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,110 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,400 వద్ద ఉంది. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,810 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై (Mumbai)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 వద్ద కొనసాగుతోంది.కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,030 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,050 వద్ద కొనసాగుతోంది.

    వెండి ధరలు పరిశీలిస్తే..

    ఢిల్లీలో కిలో వెండి ధర.60,700 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.60,700 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.64,800 ఉండగా, కోల్‌కతాలో రూ.60,700 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.60,700 ఉండగా, కేరళలో రూ.65,500 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,800 ఉండగా, విజయవాడలో రూ.64,800 వద్ద కొనసాగుతోంది.

    బంగారం ధర (gold rates)ల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Gold price, Gold Prices Today, Silver price

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు