హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Price Today: రాత్రికి రాత్రే భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: రాత్రికి రాత్రే భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

 Gold Price Today: గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర

Gold Price Today: గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర

Gold Rates | బంగారం ధరలు తగ్గాయి. పసిడి రేటు పడిపోతూనే వస్తోంది. గోల్డ్ రేటు ఈ రోజు కూడా నేల చూపులు చూసింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట. బంగారం ధరలు తగ్గాయి. పుత్తడి ఈరోజు కూడా నేల చూపులు చూసింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో (ఎంసీఎక్స్ మార్కెట్) చూస్తే బంగారం ధరలు (Gold Price) నేలచూపులు చూశాయి. పసిడి రేటు (Gold Rate) మంగళవారం దాదాపు రూ.500 మేర దిగి వచ్చింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ. 50,140కు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి పడిపోవడం సహా ట్రేడర్లు పొజిషన్లను తగ్గించుకోవడం ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా ద్రవ్యోల్బణం అంచనాల కన్నా ఎక్కువగా నమోదు కావడంతో డాలర్ పుంజుకుంది. దీంతో బంగారంపై ప్రతికూల ప్రభావం పడింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో పసిడి రేటు తగ్గుతూ వస్తోంది. వెండి రేటును గమనిస్తే.. 1.4 శాతం మేర తగ్గింది. రూ. 56,690 వద్ద కదలాడుతోంది.

    మరోవైపు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 13న బంగారం ధరలను గమనిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,980 వద్ద ఉంది. అలానే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. ఇది పది గ్రాములకు రూ. 46,730 వద్ద ఉంది. గత మూడు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పసిడి రేటు ఈ రోజు నేల చూపులు చూడటం గమనార్హం. బంగారం ధర తగ్గితే వెండి రేటు మాత్రం పైపైకి కదిలింది.

    సంక్రాంతికి ఊరెళ్లాలనుకుంటున్నారా? ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్!

    హైదరాబాద్‌లో సిల్వర్ రేటు దూసుకుపోయింది. వెండి ధర ఈరోజు రూ.1000 మేర పైకి చేరింది. దీంతో కేజీ వెండి ధర రూ. 62,400కు ఎగసింది. వెండి కొనాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వెండి రేటు వరుసగా రెండో రోజు కూడా రూ.1000 దూసుకుపోవడం గమనార్హం. కాగా పైన పేర్కొన్న ధరలకు జీఎస్‌టీ , తయారీ చార్జీలు వంటివి అదనం అని గుర్తు పెట్టుకోవాలి.

    పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి ప్రతి నెలా డబ్బులు.. ఎప్పటి నుంచి వస్తాయో తెలుసా?

    ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో చూస్తే బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. బంగారం రేటు 1.44 శాతం మేర పడిపోయింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1715 డాలర్ల వద్ద కదలాడుతోంది. వెండి రేటును గమనిస్తే.. ఔన్స్‌కు సిల్వర్ రేటు 1.55 శాతం పడిపోయింది. 19.55 డాలర్ల వద్ద కదలాడుతోంది. కాగా బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి రేట్లు సహా, డాలర్‌తో రూపాయి మారక విలువ, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లు, యుద్ధాలు, డిమాండ్ వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని గుర్తించుకోవాలి.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Gold, Gold Price Today, Gold rate hyderabad, Gold Rate Today, Silver price

    ఉత్తమ కథలు