హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Rate: తులం బంగారం ధర రూ.1 లక్ష వైపు పరుగు...పసిడి ప్రేమికులకు రక్త కన్నీరే...

Gold Rate: తులం బంగారం ధర రూ.1 లక్ష వైపు పరుగు...పసిడి ప్రేమికులకు రక్త కన్నీరే...

Gold Price Today: 
(ప్రతీకాత్మక చిత్రం)

Gold Price Today: (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate in Hyderabad: బంగారం ధరలు ఇప్పటికే దేశీయంగా 24 కేరట్ల ధర రూ. 44 వేల పై చిలుకే పలుకుతుండగా, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ఊపందుకుంటే మాత్రం అత్యంత వేగంగా బంగారం ధర తులం రూ.1 లక్ష దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంచనాలు వెలువడుతున్నాయి.

ఇంకా చదవండి ...

Todays Gold Rate in Hyderabad : బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. (gold rate in hyderabad today) ఇప్పటికే రూ.42 వేల మార్క్ క్రాస్ చేసిన పుత్తడి ధర (gold price) ముందు ముందు తులం ధర రూ.1 లక్ష వైపు పరుగులు పెడుతుందని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత రెండు రోజుల్లో పసిడి ధరలు ఆల్‌టైం రికార్డుల మోత మోగిస్తూ ఏడు సంవత్సరాల రికార్డు స్థాయిన తాకింది. కరోనా వైరస్‌ విజృంభించడంతో చైనా ఆర్థిక ప్రగతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలోని సొమ్మును మదుపరులు భద్రమైన పెట్టుబడి సాధనమైన బంగారం, వెండి వైపు తరలిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కె ట్లో డిమాండ్‌ ఊపందుకుంది. తత్ఫలితంగా ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర ఏడేళ్ల గరిష్ఠ స్థాయి 1,600 డాలర్ల ఎగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగానూ విలువైన లోహాల రేట్లు ఎగబాకాయి. గురువారం 10 గ్రాములు బంగారం (gold price) ఒక దశలో రూ.44,000 పలికింది. అటు ఇరాన్‌పై అమెరికా దాడి నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందన్న భయాలు నెలకొన్నాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి, వెండి, ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. అయితే క్రమంగా పెరుగుతున్న పసిడి ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఇన్వెస్టర్లు కరోనా వైరస్ భయాలతో ఉత్పత్తి మందగించిందని, అంచనాకు వస్తున్నారు. ఫలితంగా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ ఇప్పటికే 8 శాతం పతనమైంది. ఇది గడిచిన 4 సంవత్సరాల్లోనే భారీ పతనం కావడం గమనార్హం. మరోవైపు పరిస్థితి దిగజారకుండా ఇప్పటికే పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా దాదాపు 174 బిలియన్ డాలర్లు( రూ. 12 లక్షల కోట్లు) స్టాక్ మార్కెట్‌లలోకి ఇంజెక్ట్ చేసేందుకు సిద్ధపడుతోంది. గతంలో సార్స్ వైరస్ కన్నా ప్రస్తుత కరోనా వైరస్ మరింత భీతావహ స్థితి కల్పించనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అటు చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ప్రభావితం చేసే శక్తిగా ఉంది. ఫలితంగా దీని ప్రభావం అంతర్జాతీయ వాణిజ్యంపై స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు చైనా జీడీపీ సైతం 2020లో 5.6శాతానికి పరిమితం కానుంది. అయితే చైనా ఈక్విటీ మార్కెట్లలోని బేరిష్ ట్రెండ్ అటు బంగారానికి మాత్రం బుల్లిష్ ధోరణిని పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం అంత తొందరగా బంగారం వైపు మదుపరులు తమ పెట్టుబడులు తరలించకపోయినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం మరింత ధర పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మన దేశీయ బులియన్ మార్కెట్లపై దీని ప్రభావం ప్రత్యక్షంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర 1600 డాలర్లు తాకింది. గత సంవత్సరం డిసెంబర్ 16న ఔన్సు బంగారం ధర 1472 డాలర్లు ఉండగా. ప్రస్తుతం 1600 డాలర్లకు ఎగిసింది. అంటే ఏకంగా 130 డాలర్లు పెరిగింది. ఫలితంగా అటు దేశీయంగా సైతం బంగారం ధరలు ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు ఇప్పటికే దేశీయంగా 24 కేరట్ల ధర 44 వేల పై చిలుకే పలుకుతుండగా, ఔన్సు బంగారం 2,000 డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం సిటీ గ్రూప్‌ అంచనా వేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ఊపందుకుంటే మాత్రం అత్యంత వేగంగా బంగారం ధర తులం రూ.1 లక్ష దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంచనాలు వెలువడుతున్నాయి.

First published:

Tags: Gold, Gold bars, Gold jewell, Gold jewellery, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops

ఉత్తమ కథలు