Gold Silver Rates | బంగారం ధరలు తగ్గాయి. పసిడి రేటు పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. బులియన్ మార్కెట్లో నేడు బంగారం ధరలు దిగి వచ్చాయి. డిసెంబర్ 6న హైదరాబాద్లో బంగారం ధరలు (Gold Rate) నేలచూపులు చూశాయి. పసిడి రేటు దాదాపు రూ. 330 మేర పడిపోయింది. దీంతో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 53,780 స్థాయికి క్షీణించింది. అలాగే వెండి రేటు (Silver) కూడా పడిపోయింది. సిల్వర్ రేటు కేజీకి రూ. 500 మేర పతనమైంది. దీంతో ఈ వెండి రేటు రూ. 66,000కు దిగొచ్చింది.
అంటే పసిడి ఆల్టైమ్ గరిష్ట స్థాయి పది గ్రాములకు రూ. 57 వేలకు పైనే ఉంది. 2020 ఆగస్ట్ 7న 10 గ్రాముల బంగారం ధర రూ.57 వేల పైకి చేరింది. అంటే ఈ స్థాయితో పోలిస్తే ఇంకా బంగారం ధర రూ. 3,200 మేర దిగువునే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే వెండి రేటు అయితే ఏకంగా రూ. 11 వేలకు పైగా పతనమైంది. రెండేళ్ల కిందట వెండి ధర కేజీకి రూ. 77 వేల పైకి చేరింది. అయితే ఇప్పుడు దిగి వచ్చింది. రూ. 64 వేలకు పైన ఉంది. 2020 ఆగస్ట్ 7న వెండి ధర కేజీకి ఏకంగా రూ.77,800 పైకి చేరింది.
కస్టమర్లకు అదిరిపోయే గిఫ్ట్ అందించిన బ్యాంక్.. కీలక నిర్ణయం!
కాగా బంగారం ధరలకు జీఎస్టీ , తయారీ చార్జీలు, జువెలర్స్ ప్రాఫిట్ వంటివి అదనం. అంటే వీటికి కలుపుకుంటే బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,300గా ఉంది. అంటే దీనికి జీఎస్టీ కలుపుకుంటే ఈ పసిడి రేటు రూ. 50 వేల పైకి చేరుతుంది. ఇంకా ఈ రేట్లకు తయారీ చార్జీలు అదనం. అందువల్ల పసిడి రేట్లలో కొంత మేర వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.
కస్టమర్లకు భారీ షాకిచ్చిన 2 బ్యాంకులు.. ఈరోజు నుంచి..
కాగా మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగి వచ్చాయి. 1810 డాలర్ల సమీపంలోకి చేరిన పసిడి రేటు ఇప్పుడు 1800 డాలర్ల దిగువకు వచ్చేసింది. 1782 డాలర్ల వద్ద కదలాడుతోంది. దీంతో దేశీ మార్కెట్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్ ముందు బంగారం ధరలు దిగిరావడం అనేది చాలా మందికి ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold price, Gold Price Today, Gold rate, Gold Rate Today, Silver price, Silver rate