Gold rates today: పండగ వేళ బంగారం రేట్లు పెరిగాయా? తగ్గాయా? తాజా ధరల వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

Gold rates today: గత పది రోజుల్లో నాలుగు సార్లు ధరలు పెరిగాయి. ఐతే నిన్న మాత్రం ధరలో మార్పు లేదు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    మనదేశంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. మహిళలు సెంటిమెంట్‌గా భావిస్తారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, పండగ వచ్చినా  బంగారం కొంటారు. ఇంకొందరైతే పెట్టుబడులకు వినియోగిస్తారు. ఐతే ఈ బంగారం ధరలు (Gold Prices) ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో.. సామాన్యుడికి అస్సలు అర్థం కాదు. ఒకసారి పెరిగితే.. మరోరోజు  తగ్గుతాయి. ఇప్పుడు పండగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. గత పది రోజుల్లో నాలుగు సార్లు ధరలు పెరిగాయి. ఐతే నిన్న మాత్రం ధరలో మార్పు లేదు. బంగారంతో పాటు వెండి ధరలు (Silver Prices) కూడా స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

    నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో  రూ.44,150గా ఉంది.  అదే పెట్టుబడుల్లో వాడే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 పలుకుతోంది. 24 క్యారెట్ల ధర రూ.48,160 ఉంది.

    దీపావళికి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఈ మోడళ్లపై బెస్ట్ ఆఫర్లు

    ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46, 300కి లభిస్తోంది. అద 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,510 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,320 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,030 వద్ద అందుబాటులో ఉంది.

    కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 పలుకుతోంది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది.

    Credit Report: మీ క్రెడిట్ స్కోర్ తగ్గిందా? ఎందుకో ఇలా తెలుసుకోండి

    వెండి ధరలు:

    వెండి  ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.  ఢిల్లీలో కిలో వెండి రూ.61,800 ఉండగా, చెన్నైలో రూ.65,800 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.65,900 ఉండగా, కోల్‌కతాలో రూ.61,800 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61, 800 ఉండగా, కేరళలో రూ.65,800 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,800 ఉండగా, విజయవాడలో రూ. 65,800 వద్ద కొనసాగుతోంది.

    IRCTC Tirupati Tour: శ్రీవారి దర్శనంతో తిరుపతి టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

    బంగారం ధర నిత్యం మారుతుంటాయి.  ధరల్లో హెచ్చు తగ్గులు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం ప్రధానమైన కారణాలు. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ పలు కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. అందుకే బంగారం, వెండి ధరలు ఎప్పుడూ ఒకేళా ఉండవు
    Published by:Shiva Kumar Addula
    First published: