• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • GOLD PRICE TODAY SILVER PRICE TODAY CHECK GOLD AND SILVER RATES IN 10TH JUNE 2021 IN HYDERABAD SK

Gold rates june 10, 2021: బంగారం రేటు పెరిగిందా? తగ్గిందా? మార్కెట్లో నేటి ధరల వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

Gold and Silver rate 10-6-2021: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

  • Share this:
    బంగారం, వెండి ధరలు ఎప్పడు ఎలా ఉంటాయో  ఊహించడం కష్టమో. ఒక్కసారిగా పెరుగుతాయి.  అనుకోకుండా దిగొస్తాయి. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం (24 క్యారెట్లు) ధర 50వేల వద్ద ఊగిసలాడుతోంది. 22 క్యారెట్లల బంగారం ధర రూ.46వేలకు అటూ ఇటూగా ఉంది. కొన్ని  రోజులుగా బంగారం పెరుగుతూ తగ్గుతూ వస్తోంది. ఐతే ఇవాళ మాత్రం ధరల్లో ఎలాంటి మార్పులేదు. స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,900గా ఉంది.  నగల తయారీకి వాడే ఈ బంగారం ఒక్క గ్రాము ధర రూ.4,590 పలుకుతోంది. ఇక పెట్టుబడుల్లో వడే స్వచ్ఛమైన బంగారం ధర చాలా ప్రాంతాల్లో రూ.50వేల మార్క్ దాటింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,070గా ఉంది. నిన్నటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

    హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ, వరంగల్‌లో బంగారం ధలు ఒకేలా ఉన్నాయి. ఇతర నగరాల్లో బంగారం ధరల వివరాలు చూస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.46,300గా ఉంది. ముంబైలో రూ.47,680, న్యూఢిల్లీలో రూ.48,040, కోల్‌కతాలో రూ.48,220, బెంగళూరులో రూ.45,900గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు చెన్నైలలో 50,500గా ఉంది. ముంబైలో 48,680, న్యూఢిల్లీలో రూ.52,420, కోల్‌కతాలో రూ.50,920, బెంగళూరులో రూ.50,070 పలుకుతోంది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలు 5 సార్లు పెరిగాయి. మరో రెండు సార్లు పసిడి ధరలు దిగి వచ్చాయి. మూడు సార్లు స్థిరంగా ఉన్నాయి.

    నేటి వెండి ధరలు: ఇవాళ వెండి ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.76,100 పలుకుతోంది. 10 గ్రాముల వెండి ధర రూ.761 పలుకుతోంది. నిన్నటితో పోల్చితే రూ.2 తగ్గింది. నగరంలో ఒక్క గ్రాము వెండి ధర రూ.76.10గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్, చెన్నైలో వెండి ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో 10 గ్రాముల వెండి ధరరూ.714గా ఉంది. హైదరాబాద్ కంటే అక్కడ కాస్త తక్కువ ధరకే లభ్యమవుతోంది.

    గడిచిన 10 రోజుల్లో వెండి ధరలు నాలుగు సార్లు పెరిగాయి. ఐదు సార్లు స్వల్పంగా తగ్గాయి. ఒక రోజు మాత్రం స్థిరంగా ఉన్నాయి. వెండి ధర మే 18న గరిష్ట ధరకు చేరుకుంది. ఆ రోజు కిలో వెండి ధర రూ.78,500 పలికింది. అత్యల్ప ధర మే7న నమోదయింది. మే 7న కిలో వెండి ధర రూ.71,600కి లభ్యమయింది. ఇక ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ.. పెరుగుతూ.. ఇప్పుడు రూ.76వేలకు అటూ ఇటూగా ఉంది. కాగా, దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ నడుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కూడా తగ్గింది. వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. రుతుపవనాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ అనుకూల పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాలు పట్టి.. బంగారంపై పెట్టబడులు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: