Home /News /business /

Gold Rates June 11, 2021: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇదే ట్రెండ్ కొనసాగుతుందా..?

Gold Rates June 11, 2021: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇదే ట్రెండ్ కొనసాగుతుందా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gold price and silver price today 11th june, 2021: బంగారం కొనే వారికి శుభవార్త . పసిడి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. మరి బంగారం రేటు ఎంత తగ్గింది? హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర నగరాల్లో ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం...

ఇంకా చదవండి ...
  బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు సాధారణమే. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌ ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి ఎన్నో అంశలపై బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఒక రోజు ఉన్న ధర మరో రోజు ఉండదు. ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. బంగారం ధరలు ఇవాళ స్పల్పంగా దిగొచ్చాయి. నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి. నేడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,800గా ఉంది. ఇవాళ రూ.100 క్షీణించింది. ఒక్క గ్రాము ధర రూ.4,590 పలుకుతోంది. ఇక పెట్టుబడుల కోసం ఉపపయోగించే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రూ.50వేలు దాటింది. హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోని నగరాల్లోనూ అదే పరిస్థితి. ఐతే కాస్త తగ్గడంతో రూ.50వేలకు దిగువకు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,970గా ఉంది. నిన్నటి కంటే రూ.100 తగ్గింది.

  హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ, వరంగల్‌ సహా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో బంగారం ధలు ఒకేలా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300గా ఉంది. ఆర్థిక ముంబైలో రూ.47,880, న్యూ ఢిల్లీలో రూ.47,950, కోల్‌కతాలో రూ.48,200, బెంగళూరులో రూ.45,800గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర చెన్నై నగరంలో రూ. 50,350గా ఉంది. ముంబైలో 48,880, న్యూఢిల్లీలో రూ.52,300, కోల్‌కతాలో రూ.50,900, బెంగళూరులో రూ.49,970గా ఉంది. గత పది రోజుల్లో బంగారం ధరలు 5 సార్లు పెరిగాయి. మూడు సార్లు తగ్గాయి. రెండుసార్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి.


  Silver Price Today: ఇవాళ వెండి స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోల్చితే ధరల్లో ఎలాంటి మార్పులేదు. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.76,100 పలుకుతోంది. 10 గ్రాముల వెండి ధర రూ.761కి లభిస్తోంది. ఒక ఒక్క గ్రాము వెండి ధర రూ.76.10గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్, చెన్నైలో వెండి ధరలు ఒకేలా ఉన్నాయి. బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో 10 గ్రాముల వెండి ధరరూ.714గా ఉంది. హైదరాబాద్ కంటే అక్కడ కాస్త తక్కువ ధరకే వెండి దొరుకుతోంది. గడిచిన 10 రోజుల్లో వెండి ధరలు నాలుగు సార్లు తగ్గగా.. మరో నాలుగు సార్లు పెరిగాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్నాయి.

  కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రెండ్స్ చూస్తే.. బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇవాళ మాత్రం కాస్త తగ్గాయి. ఐతే రాబోయే రోజుల్లో బంగారంపై పెట్టబడులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో అన్ని రాష్ట్రాలూ లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తున్నాయి. మళ్లీ ఇప్పుడిప్పుడే వ్యాపారాలు ప్రారంభమవుతున్నాయి. వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తున్నాయి. సాధారణ వర్షపాతమే నమోదవుతుందని.. పంటలు బాగా పండతాయన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తమ చేతిలో ఉన్న డబ్బులను బంగారం వైపు మళ్లించే అవకాశముందని.. అదే జరిగితే పసిడి ధరలు మరింతగా పెరిగే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Gold, Gold price, Gold rate, Gold rate hyderabad, Silver, Silver price, Silver rate

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు