భారతదేశంలో బంగారం(Gold) ధరలు శుక్రవారం నాటికి స్థిరంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 17, ఉదయం 9 గంటల ప్రాంతంలో మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్ 0.03 శాతం తగ్గి రూ. 46,060 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ప్రారంభంలో వెండి ధరలకు రెక్కలొచ్చినట్లు పైకి ఎగబాకాయి. దాంతో వెండి లాభాల బాట పట్టింది. వెండి ఫ్యూచర్ 0.25 శాతం పెరిగి రూ.61,231 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. ఇక స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 1,758.10 డాలర్ల వద్ద స్థిరపడింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి 1,759.50 డాలర్లకు చేరుకుంది. ఫెడ్ క్యూకి సంబంధించి వచ్చే వారం జరిగే కీలక యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశాన్ని పెట్టుబడిదారులు గమనించనున్నారు. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ పాలసీ సమావేశం సెప్టెంబర్ 21-22 తేదీలలో జరగాల్సి ఉంది.
ఆసియాలో శుక్రవారం తెల్లవారుజామున అంతర్జాతీయ బంగారం, వెండి ధరలు ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యాయని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ తెలిపారు. కొన్ని జియోపాలిటిక్స్ లేదా ఫెడ్ లేనట్లయితే, వచ్చే వారం జరిగే సమావేశం నాటికి బంగారం ధరల్లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. LBMA గోల్డ్ ధరలో $1790 వద్ద కరెక్షన్ రావడంతో అది 1748-1735 డాలర్ల స్థాయిలను తాకవచ్చన్నారు. రెసిస్టెన్స్ గా $1762- $1775 పొజిషన్స్ ఉన్నాయన్నారు.
LBMA సిల్వర్ $23.00 స్థాయిల కంటే దిగువన ట్రేడవుతోంది. ఇది $22.30- $ 21.88 స్థాయిల వరకు పతనం కావచ్చు అన్నారు. రెసిస్టెన్స్ గా $23.20- $23.55 స్థాయిలు ఉన్నాయని తెలిపారు. యూఎస్ రిటైల్ అమ్మకాలు ఊహించని విధంగా ఆగస్టులో 0.7 శాతం పెరిగాయి. బులియన్ ట్రేడర్స్ (Bullion traders) నిరుద్యోగ సమస్యలను కూడా పట్టించుకోకుండా ట్రేడింగ్ చేశారని కార్మిక శాఖ గురువారం నివేదించింది. గురువారం సాయంత్రం యూఎస్ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే బలంగా ఉందని నివేదికలు రావడంతో యూఎస్ డాలర్ ఇండెక్స్ ర్యాలీ జరిగింది. బంగారం, వెండి ధరల్లో మార్పులు రావడానికి కూడా ఇదే కారణమని ఎవీపీ-రీసెర్చ్ కమోడిటీస్, గంగానగర్ కమోడిటీస్ లిమిటెడ్ కి చెందిన అమిత్ ఖారె అన్నారు.
టెక్నికల్ అనాలసిస్ ప్రకారం పొజిషనల్ ట్రేడర్లు బంగారం ధర రూ.45900-45700 వద్ద చిన్న మొత్తం లో ట్రేడ్ చేయాలని అమిత్ ఖారె సూచించారు. సాంకేతికంగా, దేశీయంగా MCX గోల్డ్ అక్టోబర్ రూ.46,100 స్థాయి కంటే పతనం అవుతే రూ.45,900-45,600 స్థాయిల వరకు తగ్గొచ్చని శ్రీరామ్ అయ్యర్ అన్నారు. సపోర్ట్ గా రూ.46,200-46,500 స్థాయిల ఉంటాయన్నారు. MCX సిల్వర్ డిసెంబరు రూ.61,500 స్థాయి తాకితే రూ.60,000-59,200 స్థాయిలకు పతనం కావచ్చు అన్నారు. రూ.61,900 -63,500 స్థాయిలు రెసిస్టెన్స్ గా ఉన్నాయన్నారు. ఇతర టెక్నికల్ అనలిస్టులు, ఇన్వెస్ట్మెంట్ సలహాదారులు బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని సాంకేతిక సూచీల ప్రకారం చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business Ideas, BUSINESS NEWS, Gold, Gold price down